మహతి
నా పేరు మహతి. నాకో అన్న, ఒక తమ్ముడు. మా ముగ్గురి తర్వాత చాలా కాలానికి అంటే నాకు అయిదేళ్ళు వుండగా పుట్టిన కళ్యాణి, నా చెల్లి. మా నాన్న పేరు గౌతమ్. ఆయన పేరుకి తగ్గట్టే మా అమ్మ పేరు అహల్య, మా నాన్నకీ, అమ్మకీ కూడా శరత్ సాహిత్యం అంటే ఇష్టం. అందుకే మా అన్న సురేంద్రని సురేన్ అనీ, తమ్ముడు నరేంద్రని నరేన్ అనీ పిలిచేవారు. నన్ను మహీ అని మా వాళ్ళు పిలిచేవాళ్ళు. మా నాన్న మా అమ్మని అహీ అని పిలిచేవాడు. ఇహ మా చెల్లెలి కైతే బోలెడు పేర్లు, కల్యాణీ అనో, కల్లు అనో, కన్నీ అనో, ఇవేవీ కాకుండా 'చంటి' అనో పిలిచేవాళ్ళం. అది మహా ఇంటెలిజెంట్. నా అన్నాతమ్ముడు కూడా మాంఛి క్లెవర్లే. నా విషయానికొస్తే నేనంత ఇంటెలిజెంట్ని కాను అనే చెప్పాలి. కారణం మా తాతయ్య, అమ్మమ్మ.
వాళ్ళకి మా అమ్మ ఒక్కర్తే కూతురు. ఉండేది 'కర్రావూరి ఉప్పలపాడు'లో. అదో తింగరి వూరు. నాకు మూడేళ్ళ వయసప్పుడు మా అమ్మానాన్నల్ని బతిమలాడి నన్ను వాళ్ళ వూరికి తీసికెళ్ళారు. నాకు అయిదో ఏడు వచ్చేవరకు ఇంట్లో చైత్రము వైశాఖమూ చెప్పడమే గాని బళ్ళో వెయ్యలేదు.
మా నాన్న మా తాతయ్యని బెదిరించి నన్ను బళ్ళో చేర్చాడు. బళ్ళో వెయ్యకపోవడానికి కారణం నన్ను వాళ్ళు క్షణం కూడా వదిలి వుండలేకపోవడం అని తరవాత చెప్పారు. కర్రావూరి ఉప్పలపాడు తింగరి వూరు అని చెప్పాను గదా.. ఆ వూరి గురించి చెప్పకపోతే నా అసలు సిసలు పరిచయం మీకు కలగదు.
"ఏవండీ బాగున్నారా?" అని ఎవర్నైనా సరే అడగండి.
"ఏటీ? నేను సత్తే బాగుంటాదని అనుకుంటున్నావా?" అని ఇంతెత్తున లేస్తారు..........................................
మహతి నా పేరు మహతి. నాకో అన్న, ఒక తమ్ముడు. మా ముగ్గురి తర్వాత చాలా కాలానికి అంటే నాకు అయిదేళ్ళు వుండగా పుట్టిన కళ్యాణి, నా చెల్లి. మా నాన్న పేరు గౌతమ్. ఆయన పేరుకి తగ్గట్టే మా అమ్మ పేరు అహల్య, మా నాన్నకీ, అమ్మకీ కూడా శరత్ సాహిత్యం అంటే ఇష్టం. అందుకే మా అన్న సురేంద్రని సురేన్ అనీ, తమ్ముడు నరేంద్రని నరేన్ అనీ పిలిచేవారు. నన్ను మహీ అని మా వాళ్ళు పిలిచేవాళ్ళు. మా నాన్న మా అమ్మని అహీ అని పిలిచేవాడు. ఇహ మా చెల్లెలి కైతే బోలెడు పేర్లు, కల్యాణీ అనో, కల్లు అనో, కన్నీ అనో, ఇవేవీ కాకుండా 'చంటి' అనో పిలిచేవాళ్ళం. అది మహా ఇంటెలిజెంట్. నా అన్నాతమ్ముడు కూడా మాంఛి క్లెవర్లే. నా విషయానికొస్తే నేనంత ఇంటెలిజెంట్ని కాను అనే చెప్పాలి. కారణం మా తాతయ్య, అమ్మమ్మ. వాళ్ళకి మా అమ్మ ఒక్కర్తే కూతురు. ఉండేది 'కర్రావూరి ఉప్పలపాడు'లో. అదో తింగరి వూరు. నాకు మూడేళ్ళ వయసప్పుడు మా అమ్మానాన్నల్ని బతిమలాడి నన్ను వాళ్ళ వూరికి తీసికెళ్ళారు. నాకు అయిదో ఏడు వచ్చేవరకు ఇంట్లో చైత్రము వైశాఖమూ చెప్పడమే గాని బళ్ళో వెయ్యలేదు. మా నాన్న మా తాతయ్యని బెదిరించి నన్ను బళ్ళో చేర్చాడు. బళ్ళో వెయ్యకపోవడానికి కారణం నన్ను వాళ్ళు క్షణం కూడా వదిలి వుండలేకపోవడం అని తరవాత చెప్పారు. కర్రావూరి ఉప్పలపాడు తింగరి వూరు అని చెప్పాను గదా.. ఆ వూరి గురించి చెప్పకపోతే నా అసలు సిసలు పరిచయం మీకు కలగదు. "ఏవండీ బాగున్నారా?" అని ఎవర్నైనా సరే అడగండి. "ఏటీ? నేను సత్తే బాగుంటాదని అనుకుంటున్నావా?" అని ఇంతెత్తున లేస్తారు..........................................© 2017,www.logili.com All Rights Reserved.