Karl Marx Ardhika Tatvika Ratapratulu 1844

Rs.250
Rs.250

Karl Marx Ardhika Tatvika Ratapratulu 1844
INR
MANIMN5364
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నేపధ్యం :

మానవాళి ప్రస్తుతం అత్యంత సంక్లిష్టమయిన చారిత్రక దశలో మనుగడ సాగిస్తోంది. నిరంతరం ఏదో ఒక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే పెట్టుబడిదారీ విధానం సరికొత్త రూపురేఖలు దిద్దుకుంటోంది. 20వ శతాబ్ది సోషలిజం వైఫల్యం పర్యవసానంగా చైనా, రష్యా (గత సోవియట్ యూనియన్) పెట్టుబడిదారీ పంథాకి మళ్ళాయి. ప్రపంచీకరణ పేరిట ఆ విధానం ప్రపంచవ్యాపితంగా బలోపేతం కావడానికి దోహదం చేసిన కారణాలలో ఈ అంశం కూడా ఒకటి. లాభాల దాహం, మార్కెట్ల వేట ఉత్తరార్ధ గోళానికే పరిమితం కాలేదిప్పుడు. మొదట జపాన్, తర్వాత చైనా, ప్రస్తుతం భారతదేశం, ఇంకా మరెన్నో నూతన 'శక్తులు' ఈ పరుగు పందెంలో హుషారుగా పాల్గొంటున్నాయి. ఒకవైపు సంపద కేంద్రీకరణ, మరోవైపు పడిపోతున్న నిజ ఆదాయాలు, పెరుగుతున్న దారిద్య్రం, ఫలితంగా సంపదలో అసమానతలు పూడ్చలేని అగాధాలుగా మారిపోవటం, వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యకు పరిమితమయిపోతున్న కుబేరులు -- ఇవన్నీ పెట్టుబడిదారీ విధానానికి గుణాలూ కావు, దోషాలూ కావు; అవి, ఆ విధానానికి అతి సహజమయిన లక్షణాలు మాత్రమే. చిన్నపాటి వ్యత్యాసాలతో, ప్రస్తుతం ప్రపంచమంతటా అమలులో ఉన్నది ఈ లక్షణాలతో కూడిన నయా - ఉదారవాద పెట్టుబడిదారీ విధానమే!

పెట్టుబడిదారీ విధానపు సహజ లక్షణాల గురించి అత్యంత సమర్ధవంతంగానూ, శాస్త్రీయంగానూ విశ్లేషించి, విమర్శించిన మేధావి కార్ల్ మార్క్స్. ఆయనతో నూటికి నూరుపాళ్ళూ విభేదించే వాళ్ళు కూడా ఈ మాటని కాదనలేరు. మార్క్స్ విమర్శలకు ప్రాతిపదిక ఊహాగానాలు కావు; పరిమిత జ్ఞానంపై ఆధారపడి ఏర్పర్చుకున్న అపార్ధాలూ అపోహలూ కావు. ఆడం స్మిత్, డేవిడ్ రికార్డో, ధామస్ మాల్తుస్, విల్హెల్మ్ షూల్జ్, జేమ్స్ మిల్, జె.బి.సే., యూజిన్ బ్యూరే, ఫ్రాన్స్వా క్విస్నే, ఛార్లె లయల్, జేమ్స్ మెయ్లాండ్, మీషాల్ షేవాల్యే, డీస్టట్ డి ట్రేసీ లాంటి ఆర్థికవేత్తల రచనలను మార్క్స్ కూలంకషంగా అధ్యయనం చేసి, నిష్కర్షగా విశ్లేషించాడు. ఈ అధ్యయనానికి అనుభవైక జ్ఞానాన్ని జోడించిన తర్వాత రూపొందించిన సైద్ధాంతిక భావనల పునాదిపైనే మార్క్స్ తన విమర్శను నిర్మించుకున్నాడు. విమర్శ కోసమే విమర్శ చేసే సంకుచిత ధోరణి మార్క్స్లో ఎప్పుడూ లేదు. సొంత ఆస్తి విషయంలోను, సంపద అసమ పంపిణీ విషయంలోను పైన పేర్కొన్న రాజకీయ అర్థశాస్త్రవేత్తలు అసంతృప్తి ప్రకటించిన వాస్తవాన్ని ఆయన దాచిపెట్టలేదు. నిజానికి ఆ వాస్తవాన్ని వెల్లడించడం ఆయన సిద్ధాంతానికి నైతిక బలాన్ని సమకూర్చింది.................

నేపధ్యం : మానవాళి ప్రస్తుతం అత్యంత సంక్లిష్టమయిన చారిత్రక దశలో మనుగడ సాగిస్తోంది. నిరంతరం ఏదో ఒక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే పెట్టుబడిదారీ విధానం సరికొత్త రూపురేఖలు దిద్దుకుంటోంది. 20వ శతాబ్ది సోషలిజం వైఫల్యం పర్యవసానంగా చైనా, రష్యా (గత సోవియట్ యూనియన్) పెట్టుబడిదారీ పంథాకి మళ్ళాయి. ప్రపంచీకరణ పేరిట ఆ విధానం ప్రపంచవ్యాపితంగా బలోపేతం కావడానికి దోహదం చేసిన కారణాలలో ఈ అంశం కూడా ఒకటి. లాభాల దాహం, మార్కెట్ల వేట ఉత్తరార్ధ గోళానికే పరిమితం కాలేదిప్పుడు. మొదట జపాన్, తర్వాత చైనా, ప్రస్తుతం భారతదేశం, ఇంకా మరెన్నో నూతన 'శక్తులు' ఈ పరుగు పందెంలో హుషారుగా పాల్గొంటున్నాయి. ఒకవైపు సంపద కేంద్రీకరణ, మరోవైపు పడిపోతున్న నిజ ఆదాయాలు, పెరుగుతున్న దారిద్య్రం, ఫలితంగా సంపదలో అసమానతలు పూడ్చలేని అగాధాలుగా మారిపోవటం, వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యకు పరిమితమయిపోతున్న కుబేరులు -- ఇవన్నీ పెట్టుబడిదారీ విధానానికి గుణాలూ కావు, దోషాలూ కావు; అవి, ఆ విధానానికి అతి సహజమయిన లక్షణాలు మాత్రమే. చిన్నపాటి వ్యత్యాసాలతో, ప్రస్తుతం ప్రపంచమంతటా అమలులో ఉన్నది ఈ లక్షణాలతో కూడిన నయా - ఉదారవాద పెట్టుబడిదారీ విధానమే! పెట్టుబడిదారీ విధానపు సహజ లక్షణాల గురించి అత్యంత సమర్ధవంతంగానూ, శాస్త్రీయంగానూ విశ్లేషించి, విమర్శించిన మేధావి కార్ల్ మార్క్స్. ఆయనతో నూటికి నూరుపాళ్ళూ విభేదించే వాళ్ళు కూడా ఈ మాటని కాదనలేరు. మార్క్స్ విమర్శలకు ప్రాతిపదిక ఊహాగానాలు కావు; పరిమిత జ్ఞానంపై ఆధారపడి ఏర్పర్చుకున్న అపార్ధాలూ అపోహలూ కావు. ఆడం స్మిత్, డేవిడ్ రికార్డో, ధామస్ మాల్తుస్, విల్హెల్మ్ షూల్జ్, జేమ్స్ మిల్, జె.బి.సే., యూజిన్ బ్యూరే, ఫ్రాన్స్వా క్విస్నే, ఛార్లె లయల్, జేమ్స్ మెయ్లాండ్, మీషాల్ షేవాల్యే, డీస్టట్ డి ట్రేసీ లాంటి ఆర్థికవేత్తల రచనలను మార్క్స్ కూలంకషంగా అధ్యయనం చేసి, నిష్కర్షగా విశ్లేషించాడు. ఈ అధ్యయనానికి అనుభవైక జ్ఞానాన్ని జోడించిన తర్వాత రూపొందించిన సైద్ధాంతిక భావనల పునాదిపైనే మార్క్స్ తన విమర్శను నిర్మించుకున్నాడు. విమర్శ కోసమే విమర్శ చేసే సంకుచిత ధోరణి మార్క్స్లో ఎప్పుడూ లేదు. సొంత ఆస్తి విషయంలోను, సంపద అసమ పంపిణీ విషయంలోను పైన పేర్కొన్న రాజకీయ అర్థశాస్త్రవేత్తలు అసంతృప్తి ప్రకటించిన వాస్తవాన్ని ఆయన దాచిపెట్టలేదు. నిజానికి ఆ వాస్తవాన్ని వెల్లడించడం ఆయన సిద్ధాంతానికి నైతిక బలాన్ని సమకూర్చింది.................

Features

  • : Karl Marx Ardhika Tatvika Ratapratulu 1844
  • : Samiksha Mitra Brundam
  • : Samiksha Prachuranalu
  • : MANIMN5364
  • : paparback
  • : Feb, 2024
  • : 381
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Karl Marx Ardhika Tatvika Ratapratulu 1844

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam