మల్లె సుగంధం
క్లాసుల్లేవని కాలేజీ నుంచి ఆరోజు త్వరగా వచ్చేసింది సౌమ్య. గత నాలుగు రోజులుగా ఏదో అస్థిమితం వేధిస్తోంది. స్నేహితురాళ్లని కలుసుకుని కాసిని కబుర్లు కలబోసుకుంటే ఆ ఆరాటం నెమ్మదిస్తుంది. అందుకే వాళ్లని రమ్మని చెప్పింది. వరండాలో ఆరిన బట్టలు తీసి, అతిథుల కోసం కాసిని పకోడీలు చేసిపెట్టింది.
ఇంతలో ఫోన్
సుభద్ర ఆఫీసులో పని తెమిలేలా లేదని, రాలేనని చెప్పింది. పల్లవి మాత్రం వస్తున్నానంటూ మెసేజ్ పెట్టింది. సుభద్ర, పల్లవి, సౌమ్య ! కాలేజీ రోజుల నాటి స్నేహం. ముగ్గురి జీవితాలు సమాంతరంగా నడుస్తున్నాయి. ఎప్పుడో ఒక ఫోన్ పలకరింపు. అంతకుమించి ముగ్గురూ కల్సుకునే తీరిక ఎప్పుడో కానీ దొరకనే దొరకదు.
రాత్రి వంటకి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూనే ఆలోచనల్లో పడింది. జీవితం విసిరిన పెద్ద సవాళ్లనే ఎదుర్కొన్న సౌమ్య ఇప్పుడిప్పుడు ప్రతి విషయానికి బెంగ పడుతోంది. ఆమెకే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు తగ్గట్టు సౌమ్యురాలు. సౌమ్య, భర్త సుధాకర్ కూడా లెక్చరర్స్. ఇద్దరూ జీవితం పట్ల మంచి అవగాహన ఉన్నవాళ్ళు. చుట్టూ ఉన్నవాళ్లని కూడా కలుపుకునే మనస్తత్వం వాళ్ళిద్దరిదీ. వాళ్లని చూసి ఆదర్శ జంట అంటూ అందరూ ముచ్చట పడేవారు.
దాదాపు పది పదిహేనేళ్ల క్రితం సుధాకర్ స్నేహితుడితో కలిసి టూ వీలర్ మీద............
మల్లె సుగంధం క్లాసుల్లేవని కాలేజీ నుంచి ఆరోజు త్వరగా వచ్చేసింది సౌమ్య. గత నాలుగు రోజులుగా ఏదో అస్థిమితం వేధిస్తోంది. స్నేహితురాళ్లని కలుసుకుని కాసిని కబుర్లు కలబోసుకుంటే ఆ ఆరాటం నెమ్మదిస్తుంది. అందుకే వాళ్లని రమ్మని చెప్పింది. వరండాలో ఆరిన బట్టలు తీసి, అతిథుల కోసం కాసిని పకోడీలు చేసిపెట్టింది. ఇంతలో ఫోన్ సుభద్ర ఆఫీసులో పని తెమిలేలా లేదని, రాలేనని చెప్పింది. పల్లవి మాత్రం వస్తున్నానంటూ మెసేజ్ పెట్టింది. సుభద్ర, పల్లవి, సౌమ్య ! కాలేజీ రోజుల నాటి స్నేహం. ముగ్గురి జీవితాలు సమాంతరంగా నడుస్తున్నాయి. ఎప్పుడో ఒక ఫోన్ పలకరింపు. అంతకుమించి ముగ్గురూ కల్సుకునే తీరిక ఎప్పుడో కానీ దొరకనే దొరకదు. రాత్రి వంటకి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూనే ఆలోచనల్లో పడింది. జీవితం విసిరిన పెద్ద సవాళ్లనే ఎదుర్కొన్న సౌమ్య ఇప్పుడిప్పుడు ప్రతి విషయానికి బెంగ పడుతోంది. ఆమెకే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు తగ్గట్టు సౌమ్యురాలు. సౌమ్య, భర్త సుధాకర్ కూడా లెక్చరర్స్. ఇద్దరూ జీవితం పట్ల మంచి అవగాహన ఉన్నవాళ్ళు. చుట్టూ ఉన్నవాళ్లని కూడా కలుపుకునే మనస్తత్వం వాళ్ళిద్దరిదీ. వాళ్లని చూసి ఆదర్శ జంట అంటూ అందరూ ముచ్చట పడేవారు. దాదాపు పది పదిహేనేళ్ల క్రితం సుధాకర్ స్నేహితుడితో కలిసి టూ వీలర్ మీద............© 2017,www.logili.com All Rights Reserved.