Manchi Nidra

Rs.300
Rs.300

Manchi Nidra
INR
NAVOPH0663
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       పరిణామంలో 20 లక్షల ఏళ్ల క్రితం అవతరించిన మన పూర్వులు 'హోమో సెపియన్' వారసత్వ కొనసాగింపులో నేడు మనం ఉన్నాము. మన బతుకు నిడివిని పెంచి, నాణ్యతను అద్దటానికి 'నిద్ర' ని రూపొందించి మనలో కూర్చింది ప్రకృతి. ప్రకృతిలో మానవ జాతి కూడా ఓ జంతు సమూహమే అయినా, మనిషి ప్రకృతిలోనే కాక, నాగారికుడిగా రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక విలువలతో ఉన్న 'సమాజం' లోనూ బతకాలి. మనుగడ కోసం చేసే పోరులో పగటి వేళలు చాలక, నిద్ర వేళల్లోకి చొరబడటంతో, నిద్ర తన సహజ గుణాన్ని కోల్పోతుంది. లక్షల ఏళ్లుగా మనల్ని అంటి పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్న నిద్ర నేడు బీటలు వారుతుంది. పరిణామంలో జీవుల శరీర ధర్మాలలో ఓ చిన్న మార్పును ఇముడ్చుకొను లక్షలాది ఏళ్ళు తీసుకుంటుంది.

            నిద్ర విషయంలో అతి తక్కువ కాలంలో భారీ మార్పులు చోటు చేసుకోవటంతో మనిషి శరీరం సర్దుబాటు కాలేక గింజుకుంటుంది. కొత్త కొత్త జబ్బులు రావటం, ఉన్న జబ్బులు ముదరటం, ముదిమిలో పొడ చూపాల్సిన జబ్బులు పిన్నతనం లోనే రావటం, తగ్గాల్సిన జబ్బులు మొండికి వేయటం ఈ గింజులాటలో భాగమే. ఈ నేపథ్యంలో సామాజిక జీవనంలో గాడి తప్పుతున్న సహజ పనులు అయిన తిండి, నిద్ర, జతకట్టు ప్రవర్తనలో సామాజిక అవసరాలు కాదనకుండా, సమాజంతో నడుస్తూనే, సహజంగా పొందే శాస్త్రీయ మార్గాలు ఉన్నాయి. వాటిని అందించే గురితో వచ్చిన మొదటి పుస్తకం 'మంచి నిద్ర'. రాబోయే కాలంలో మిగతా రెండూ రానున్నాయి.

                              - డా శ్రీనివాస తేజ

       పరిణామంలో 20 లక్షల ఏళ్ల క్రితం అవతరించిన మన పూర్వులు 'హోమో సెపియన్' వారసత్వ కొనసాగింపులో నేడు మనం ఉన్నాము. మన బతుకు నిడివిని పెంచి, నాణ్యతను అద్దటానికి 'నిద్ర' ని రూపొందించి మనలో కూర్చింది ప్రకృతి. ప్రకృతిలో మానవ జాతి కూడా ఓ జంతు సమూహమే అయినా, మనిషి ప్రకృతిలోనే కాక, నాగారికుడిగా రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక విలువలతో ఉన్న 'సమాజం' లోనూ బతకాలి. మనుగడ కోసం చేసే పోరులో పగటి వేళలు చాలక, నిద్ర వేళల్లోకి చొరబడటంతో, నిద్ర తన సహజ గుణాన్ని కోల్పోతుంది. లక్షల ఏళ్లుగా మనల్ని అంటి పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్న నిద్ర నేడు బీటలు వారుతుంది. పరిణామంలో జీవుల శరీర ధర్మాలలో ఓ చిన్న మార్పును ఇముడ్చుకొను లక్షలాది ఏళ్ళు తీసుకుంటుంది.             నిద్ర విషయంలో అతి తక్కువ కాలంలో భారీ మార్పులు చోటు చేసుకోవటంతో మనిషి శరీరం సర్దుబాటు కాలేక గింజుకుంటుంది. కొత్త కొత్త జబ్బులు రావటం, ఉన్న జబ్బులు ముదరటం, ముదిమిలో పొడ చూపాల్సిన జబ్బులు పిన్నతనం లోనే రావటం, తగ్గాల్సిన జబ్బులు మొండికి వేయటం ఈ గింజులాటలో భాగమే. ఈ నేపథ్యంలో సామాజిక జీవనంలో గాడి తప్పుతున్న సహజ పనులు అయిన తిండి, నిద్ర, జతకట్టు ప్రవర్తనలో సామాజిక అవసరాలు కాదనకుండా, సమాజంతో నడుస్తూనే, సహజంగా పొందే శాస్త్రీయ మార్గాలు ఉన్నాయి. వాటిని అందించే గురితో వచ్చిన మొదటి పుస్తకం 'మంచి నిద్ర'. రాబోయే కాలంలో మిగతా రెండూ రానున్నాయి.                               - డా శ్రీనివాస తేజ

Features

  • : Manchi Nidra
  • : Dr Pamidi Srinivasa Teja
  • : Sri Publications
  • : NAVOPH0663
  • : Paperback
  • : 2016
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manchi Nidra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam