Satya Darshanam

By Gentela Venkataramana (Author)
Rs.50
Rs.50

Satya Darshanam
INR
ETCBKTC032
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            ఈ చిన్న పుస్తకంలో ముఖ్యంగా సాధన, ధ్యానానికి సంబంధించిన విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా మూడు అంశాలను తీసుకొని ఏది సహజ ధ్యానానికి దారితీస్తుందో దాన్ని ఆవిష్కరించేందుకు ఈ ప్రయత్నం జరిగింది. ధ్యానానికి గానీ, జీవనానికి గానీ మనసే కారణం. అజ్ఞానానికి, బంధానికి, అవి అనిపించటానికి, ముక్తికి ధ్యానానికి కారణమైంది రెండే విషయాలు 1. మనసు, 2. అహంకారం(నేను).

               అరుణాచల మహర్షి శ్రీరమణ భగవాన్ 'నేనెవరు?'తెలుసుకోమన్నారు. అంటూనే మనసు, నేను వేరుకాదని అన్నారు. అహంకారం మనసు వేరుకాదని అన్నారు. మనసు అన్నా, అహంకారం అన్నా, నేను అన్నా ఒక్కటే. ఈ మనసే నేను బందితుడిని, నేను ముక్తుడిని అని, అంతేకాక జీవుడనే ప్రత్యేక వ్యక్తి ఉన్నాడని అనిపించేలా చేస్తుంది. భగత్ జీవేశ్వర భావం ఏర్పరుస్తుంది. ద్రష్ట, దృక్కు, దృశ్యం - వీటి మధ్య నిజంగా విభజన లేదు. ఈ విభజన ప్రక్రియే మనసు, జీవుడు. దీన్ని కల్పించేది కూడా మనసే. ఇదే అన్నింటికీ కారణం. జీవుడంటూ ప్రత్యేకంగా లేదని బోధించారు.

           తాత్వికులు శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారు మనసు ఎలా ఏర్పడుతుంది అన్న విషయం గురించి ఆవిష్కరిస్తూ మనసే అన్నిటికీ కారణం అని అంటారు. అంటే జీవన ప్రక్రియలో మనసు పుట్టుక, దాని ప్రభావం, దాని అనుభవాల గురించి వివరించారు.

                సత్యం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది. ఉన్నదీ ఒక్కటే. కనుక ఇద్దరూ చెప్పింది కూడా ఒక్కటే. వారి బోధనలో నుండి ఆ ఒక్కదాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం. ఇద్దరూ చెప్పింది మనసే కాబట్టి ముందుగా ఆ మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

                 

            ఈ చిన్న పుస్తకంలో ముఖ్యంగా సాధన, ధ్యానానికి సంబంధించిన విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా మూడు అంశాలను తీసుకొని ఏది సహజ ధ్యానానికి దారితీస్తుందో దాన్ని ఆవిష్కరించేందుకు ఈ ప్రయత్నం జరిగింది. ధ్యానానికి గానీ, జీవనానికి గానీ మనసే కారణం. అజ్ఞానానికి, బంధానికి, అవి అనిపించటానికి, ముక్తికి ధ్యానానికి కారణమైంది రెండే విషయాలు 1. మనసు, 2. అహంకారం(నేను).                అరుణాచల మహర్షి శ్రీరమణ భగవాన్ 'నేనెవరు?'తెలుసుకోమన్నారు. అంటూనే మనసు, నేను వేరుకాదని అన్నారు. అహంకారం మనసు వేరుకాదని అన్నారు. మనసు అన్నా, అహంకారం అన్నా, నేను అన్నా ఒక్కటే. ఈ మనసే నేను బందితుడిని, నేను ముక్తుడిని అని, అంతేకాక జీవుడనే ప్రత్యేక వ్యక్తి ఉన్నాడని అనిపించేలా చేస్తుంది. భగత్ జీవేశ్వర భావం ఏర్పరుస్తుంది. ద్రష్ట, దృక్కు, దృశ్యం - వీటి మధ్య నిజంగా విభజన లేదు. ఈ విభజన ప్రక్రియే మనసు, జీవుడు. దీన్ని కల్పించేది కూడా మనసే. ఇదే అన్నింటికీ కారణం. జీవుడంటూ ప్రత్యేకంగా లేదని బోధించారు.            తాత్వికులు శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారు మనసు ఎలా ఏర్పడుతుంది అన్న విషయం గురించి ఆవిష్కరిస్తూ మనసే అన్నిటికీ కారణం అని అంటారు. అంటే జీవన ప్రక్రియలో మనసు పుట్టుక, దాని ప్రభావం, దాని అనుభవాల గురించి వివరించారు.                 సత్యం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది. ఉన్నదీ ఒక్కటే. కనుక ఇద్దరూ చెప్పింది కూడా ఒక్కటే. వారి బోధనలో నుండి ఆ ఒక్కదాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం. ఇద్దరూ చెప్పింది మనసే కాబట్టి ముందుగా ఆ మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.                  

Features

  • : Satya Darshanam
  • : Gentela Venkataramana
  • : Sri Gurudham
  • : ETCBKTC032
  • : Paperback
  • : 2017
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Satya Darshanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam