Ooru- Peru Andhrapradesh

By Vandrangi Kondala Rao (Author)
Rs.100
Rs.100

Ooru- Peru Andhrapradesh
INR
PALLAVI034
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               ఎవరికైనా తమ ఊరి పేరు గురించి చెబితే ఆసక్తిగా వినడం చూస్తుంటాం. ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో  తెలుసుకోవాలనే ఉబలాటం ఉంటుంది. ఇక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన ఊర్లకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందామనుకుంటే ఆ అనుభూతి ఏ విధంగా ఉంటుందో యిట్టె ఊహించుకోవచ్చు. రచయిత, జర్నలిస్టు శ్రీ వాండ్రంగి కొండలరావు ఈ ఊహను నిజం చేయడం కోసం కలం పట్టారు. నిరంతరం అధ్యయనం చేసి ఏ ఊరు పేరు ఎలా వచ్చిందో స్పష్టంగా చెబుతూ కథనాలు రూపొందించారు. 

             శ్రీ కొండలరావు చేసిన అధ్యయనాన్ని నిజంగా ఏదైనా యూనివర్సిటీలో విద్యార్థులు చేసి ఉంటే దీనికి 10 పీ హెచ్ డిలు వచ్చి ఉండేవి. ఎందుకంటే ఊరు ఉన్నంత వరకే కాదు లేకున్నా పుస్తకం బతికి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మాట ఎందుకన్నానంటే కొన్ని ప్రాజెక్టుల కోసం ఊర్లకు ఊర్లు పోతున్నాయి. చరిత్రలో కనుమరుగు అవుతున్నాయి. అయినప్పటికీ ఆయన రాసిన పుస్తకంలో ఆ ఊర్లు, ఆ ఊర్ల చరిత్రలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.

              కొంతమందికి, కొన్ని వస్తువులకు తయారు చేసిన వారికి స్వయంగా కాకుండా మొత్తం ఊరికే పేరు వస్తుండడం మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఖద్దరు చూసినప్పుడల్లా పొందూరు గుర్తొస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు విజయనగరం పైడితల్లి ,అనకాపల్లి నూకాలమ్మ, విశాఖపట్నం సింహాద్రి అప్పన్న, అరసవిల్లి సూర్యనారాయణస్వామి మన మదిలో ఉంటారు. అరపవిల్లి గురించి రచయిత చెబుతూ అక్కడి సూర్యదేవాలయంలో ప్రవేశించగానే హర్షాతిరేకం కలిగి హర్షవెల్లియే అనిపిస్తుందని రాశారు. అర్మస్సు అనగా మూల వ్యాధి, సూర్యారాదన చేస్తే ఈ వ్యాధి నయమవుతుందని. అందుకే అరసవిల్లి అని మరో కథనాన్ని బయటపెట్టారు. ఇలా ఏ ఊరికి ఆ ఊరి చరిత్రను ఈ పుస్తకంలో పదిలపరిచారు.

               ఎవరికైనా తమ ఊరి పేరు గురించి చెబితే ఆసక్తిగా వినడం చూస్తుంటాం. ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో  తెలుసుకోవాలనే ఉబలాటం ఉంటుంది. ఇక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన ఊర్లకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందామనుకుంటే ఆ అనుభూతి ఏ విధంగా ఉంటుందో యిట్టె ఊహించుకోవచ్చు. రచయిత, జర్నలిస్టు శ్రీ వాండ్రంగి కొండలరావు ఈ ఊహను నిజం చేయడం కోసం కలం పట్టారు. నిరంతరం అధ్యయనం చేసి ఏ ఊరు పేరు ఎలా వచ్చిందో స్పష్టంగా చెబుతూ కథనాలు రూపొందించారు.               శ్రీ కొండలరావు చేసిన అధ్యయనాన్ని నిజంగా ఏదైనా యూనివర్సిటీలో విద్యార్థులు చేసి ఉంటే దీనికి 10 పీ హెచ్ డిలు వచ్చి ఉండేవి. ఎందుకంటే ఊరు ఉన్నంత వరకే కాదు లేకున్నా పుస్తకం బతికి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మాట ఎందుకన్నానంటే కొన్ని ప్రాజెక్టుల కోసం ఊర్లకు ఊర్లు పోతున్నాయి. చరిత్రలో కనుమరుగు అవుతున్నాయి. అయినప్పటికీ ఆయన రాసిన పుస్తకంలో ఆ ఊర్లు, ఆ ఊర్ల చరిత్రలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.               కొంతమందికి, కొన్ని వస్తువులకు తయారు చేసిన వారికి స్వయంగా కాకుండా మొత్తం ఊరికే పేరు వస్తుండడం మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఖద్దరు చూసినప్పుడల్లా పొందూరు గుర్తొస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు విజయనగరం పైడితల్లి ,అనకాపల్లి నూకాలమ్మ, విశాఖపట్నం సింహాద్రి అప్పన్న, అరసవిల్లి సూర్యనారాయణస్వామి మన మదిలో ఉంటారు. అరపవిల్లి గురించి రచయిత చెబుతూ అక్కడి సూర్యదేవాలయంలో ప్రవేశించగానే హర్షాతిరేకం కలిగి హర్షవెల్లియే అనిపిస్తుందని రాశారు. అర్మస్సు అనగా మూల వ్యాధి, సూర్యారాదన చేస్తే ఈ వ్యాధి నయమవుతుందని. అందుకే అరసవిల్లి అని మరో కథనాన్ని బయటపెట్టారు. ఇలా ఏ ఊరికి ఆ ఊరి చరిత్రను ఈ పుస్తకంలో పదిలపరిచారు.

Features

  • : Ooru- Peru Andhrapradesh
  • : Vandrangi Kondala Rao
  • : Pallavi Publications
  • : PALLAVI034
  • : Paperback
  • : 2017
  • : 296
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ooru- Peru Andhrapradesh

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam