Brahmasutralu

By Shyama Sastry (Author)
Rs.120
Rs.120

Brahmasutralu
INR
ETCBKTC102
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             భారతీయ సనాతన ధర్మ మహాసౌధానికి మూలస్థంభాలు మూడు. అవి ప్రస్థాన త్రయంగా పేర్కొనే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అందుకనే త్రిమతాచార్యులు ఈ మూడింటిపై తమ వ్యాఖ్యలను అందించారు. ఇంకా అనేకులైన పండిత ప్రకాండులు, యతివరేణ్యులు, బుధజనులు ఈ మూలగ్రంథాలపై వ్యాఖ్యానించి వాటి అవగాహనను సులభతరం చేయటమే కాక ఆర్షధర్మాన్ని ఇంకా సుసంపన్నం చేశారు. నిగూడం, దురధిగమం, గహనం, గభీరమైన విషయాలను సూత్రరూపంలో వ్యక్తం చేయటం భారతీయ సంప్రదాయంలోనే ఉంది. అంటే వీటిని ఈ విధంగా వ్యక్తంచేసి వాటిని సామాన్యులు అర్థం చేసుకోకుండా ఉండాలన్నది వారి ఉద్దేశ్యం కాదు. 

             విషయం సూక్ష్మమైనది కావున నిశిత బుద్ధికలిగిన వారే వీటిని అర్థంచేసుకోవడానికి అర్హులని తెలియజేయడం వారి అభిమతం. అలా ధీశక్తిని వికసింపజేసుకున్న వారికి సూత్రాలలోని అంతరార్థం చక్కగా అవగతమవుతుంది. అలా కాకుండా మహోన్నత సత్యాలను సూత్రరూపంలోనో, శ్లోకరూపంలోనో కాక పైపై భాషలో వ్యక్తం చేసిన మానసిక పవిత్రతలేని వారందరూ చదివి అర్థంచేసుకోకుండా అపహాస్యం చేసిన పుస్తకంలోని విషయం పరబ్రహ్మం కావున ఆ దైవనింద దోషము కృతికర్తకు కూడా అంటుకునే ప్రమాదం ఉన్నాడని గ్రహించి వేదవ్యాస మహర్షి స్థూలబుద్ధికి దుస్తరమైన విషయాన్ని ఈ విధంగా సూత్రీకరించి ఉండవచ్చును.

                   ఐననూ రానున్నది కలియుగమని గ్రహించి అధిక సంఖ్యాకులు మందబుద్దులుగా ఉంటారని తెలిసి విష్ణురూపుడైన మహర్షి ఇతిహాస పురాణాల ద్వారా ఆ సత్యాలను మళ్ళీ పునః ఆవిష్కరించారు. వాటిలోని కథలలో, పాత్రలలో అంతర్లీనంగా ఉన్న వేదాంత సత్యాలనీ బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులోనివే. మహాభారత అంతర్భాగమైన భగవద్గీతలో ఈ విజ్ఞానమంతా సామాన్యజనులకు కూడా అర్థమయ్యేరీతిలో తేటతెల్లం చేయబడింది. కానీ ఆ జ్ఞానానికి మూలగ్రంథాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలే.

             భారతీయ సనాతన ధర్మ మహాసౌధానికి మూలస్థంభాలు మూడు. అవి ప్రస్థాన త్రయంగా పేర్కొనే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అందుకనే త్రిమతాచార్యులు ఈ మూడింటిపై తమ వ్యాఖ్యలను అందించారు. ఇంకా అనేకులైన పండిత ప్రకాండులు, యతివరేణ్యులు, బుధజనులు ఈ మూలగ్రంథాలపై వ్యాఖ్యానించి వాటి అవగాహనను సులభతరం చేయటమే కాక ఆర్షధర్మాన్ని ఇంకా సుసంపన్నం చేశారు. నిగూడం, దురధిగమం, గహనం, గభీరమైన విషయాలను సూత్రరూపంలో వ్యక్తం చేయటం భారతీయ సంప్రదాయంలోనే ఉంది. అంటే వీటిని ఈ విధంగా వ్యక్తంచేసి వాటిని సామాన్యులు అర్థం చేసుకోకుండా ఉండాలన్నది వారి ఉద్దేశ్యం కాదు.               విషయం సూక్ష్మమైనది కావున నిశిత బుద్ధికలిగిన వారే వీటిని అర్థంచేసుకోవడానికి అర్హులని తెలియజేయడం వారి అభిమతం. అలా ధీశక్తిని వికసింపజేసుకున్న వారికి సూత్రాలలోని అంతరార్థం చక్కగా అవగతమవుతుంది. అలా కాకుండా మహోన్నత సత్యాలను సూత్రరూపంలోనో, శ్లోకరూపంలోనో కాక పైపై భాషలో వ్యక్తం చేసిన మానసిక పవిత్రతలేని వారందరూ చదివి అర్థంచేసుకోకుండా అపహాస్యం చేసిన పుస్తకంలోని విషయం పరబ్రహ్మం కావున ఆ దైవనింద దోషము కృతికర్తకు కూడా అంటుకునే ప్రమాదం ఉన్నాడని గ్రహించి వేదవ్యాస మహర్షి స్థూలబుద్ధికి దుస్తరమైన విషయాన్ని ఈ విధంగా సూత్రీకరించి ఉండవచ్చును.                    ఐననూ రానున్నది కలియుగమని గ్రహించి అధిక సంఖ్యాకులు మందబుద్దులుగా ఉంటారని తెలిసి విష్ణురూపుడైన మహర్షి ఇతిహాస పురాణాల ద్వారా ఆ సత్యాలను మళ్ళీ పునః ఆవిష్కరించారు. వాటిలోని కథలలో, పాత్రలలో అంతర్లీనంగా ఉన్న వేదాంత సత్యాలనీ బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులోనివే. మహాభారత అంతర్భాగమైన భగవద్గీతలో ఈ విజ్ఞానమంతా సామాన్యజనులకు కూడా అర్థమయ్యేరీతిలో తేటతెల్లం చేయబడింది. కానీ ఆ జ్ఞానానికి మూలగ్రంథాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలే.

Features

  • : Brahmasutralu
  • : Shyama Sastry
  • : Ramakrishna Matham
  • : ETCBKTC102
  • : Paperback
  • : 2017
  • : 526
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Brahmasutralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam