Jeevana Vahini

By Akkiraju Ramapati Rao (Author)
Rs.175
Rs.175

Jeevana Vahini
INR
EMESCO0099
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                           తెలుగు సాహిత్యంలో స్వీయచరిత్ర ఆధినిక ప్రక్రియ. కధ, నవల, నాటికల వంటిది. అయితే నూరేళ్ళకాలంలో తక్కిన అధనిక ప్రక్రియలలో వెలువడినాన్ని రచనలు స్వీయచరిత్ర ప్రక్రియకు సంబంభించి రాలేదు  ఈ  స్వీయచరిత్ర ప్రక్రియ బహుళ సంఖ్యత్మకంగా ప్రాచుర్యం పోందలేదన్న మాట. కధ, నవల, నాటిక, ఇంకా నాటకం కూడా తెలుగులో ఆధునిక ప్రక్రియగానే భావిస్తే ఈ గడచిన నూరు సంవత్సరాల వ్యవధిలో ఇవి వేల సంఖ్యను దాటాయి. కానీ స్వీయ చరిత్రలు ఒక రెండువందలు దాకా మాత్రమే వెలువడ్డాయి. తెలుగులో ఆధునిక సాహిత్యవిర్భావమంటు పరిగనించవలసి వస్తే అంతా నూరు నూట ఇరవై సంవత్సరలకన్న దీనిని ప్రసక్తం చేయలేము. తెలుగులో చెప్పుకోదగిన జీవిత చరిత్రలు కూడా నురింటిని చెప్పలేము. అంటే స్వీయ చరిత్రకాని తక్కిన ఆధునిక ప్రక్రియల వంటివి కావన్నమాట. కవిత్వంలగానో, కధలగానో, ఆమాటకు వస్తే సాహిత్య విమర్శలాగానో, సాహిత్య చరిత్రలగానో స్వీయచరిత్ర రచన సాధ్యం కాదు. సృజనాత్మకత అక్కరలేదు అనుకోకూడదు. స్వీయచరిత్ర రచన అంటే తనను గూర్చి తన ప్రపంచం గూర్చి చెప్పేది కాబట్టి చెప్పే వ్యక్తికీ ఒక ఆర్తి, ఒక స్పూర్తి ఉండాలి. ఇతరులు తెలుసు కోవలసిన విషయాలు కనీసం కొన్ని అయినా ఉండాలి. ప్రపంచం పోకడను ఆవిష్కరించగలగాలి. చదివే వారిలో ఒక ఆసక్తిని పరిపోషించాలి. చదువు తున్నంతసేపు పరివర్ధితం చేయాలి. స్వీయచరిత్ర రాసే వ్యక్తికీ అవ్యవహిత గతాన్ని గూర్చి, సమకాలాన్ని గూర్చి ఒక విసృతాధ్యయనం కావాలి. విశ్లేషణ చేయగలిగి ఉండాలి. మానవ సంబంధాలను అవగాహన చేసుకోగలగాలి. దేశాటనం ఒక యోగ్యతా లేదా అర్హత.

                                                                                               అక్కిరాజు రమాపతిరావు         

                           తెలుగు సాహిత్యంలో స్వీయచరిత్ర ఆధినిక ప్రక్రియ. కధ, నవల, నాటికల వంటిది. అయితే నూరేళ్ళకాలంలో తక్కిన అధనిక ప్రక్రియలలో వెలువడినాన్ని రచనలు స్వీయచరిత్ర ప్రక్రియకు సంబంభించి రాలేదు  ఈ  స్వీయచరిత్ర ప్రక్రియ బహుళ సంఖ్యత్మకంగా ప్రాచుర్యం పోందలేదన్న మాట. కధ, నవల, నాటిక, ఇంకా నాటకం కూడా తెలుగులో ఆధునిక ప్రక్రియగానే భావిస్తే ఈ గడచిన నూరు సంవత్సరాల వ్యవధిలో ఇవి వేల సంఖ్యను దాటాయి. కానీ స్వీయ చరిత్రలు ఒక రెండువందలు దాకా మాత్రమే వెలువడ్డాయి. తెలుగులో ఆధునిక సాహిత్యవిర్భావమంటు పరిగనించవలసి వస్తే అంతా నూరు నూట ఇరవై సంవత్సరలకన్న దీనిని ప్రసక్తం చేయలేము. తెలుగులో చెప్పుకోదగిన జీవిత చరిత్రలు కూడా నురింటిని చెప్పలేము. అంటే స్వీయ చరిత్రకాని తక్కిన ఆధునిక ప్రక్రియల వంటివి కావన్నమాట. కవిత్వంలగానో, కధలగానో, ఆమాటకు వస్తే సాహిత్య విమర్శలాగానో, సాహిత్య చరిత్రలగానో స్వీయచరిత్ర రచన సాధ్యం కాదు. సృజనాత్మకత అక్కరలేదు అనుకోకూడదు. స్వీయచరిత్ర రచన అంటే తనను గూర్చి తన ప్రపంచం గూర్చి చెప్పేది కాబట్టి చెప్పే వ్యక్తికీ ఒక ఆర్తి, ఒక స్పూర్తి ఉండాలి. ఇతరులు తెలుసు కోవలసిన విషయాలు కనీసం కొన్ని అయినా ఉండాలి. ప్రపంచం పోకడను ఆవిష్కరించగలగాలి. చదివే వారిలో ఒక ఆసక్తిని పరిపోషించాలి. చదువు తున్నంతసేపు పరివర్ధితం చేయాలి. స్వీయచరిత్ర రాసే వ్యక్తికీ అవ్యవహిత గతాన్ని గూర్చి, సమకాలాన్ని గూర్చి ఒక విసృతాధ్యయనం కావాలి. విశ్లేషణ చేయగలిగి ఉండాలి. మానవ సంబంధాలను అవగాహన చేసుకోగలగాలి. దేశాటనం ఒక యోగ్యతా లేదా అర్హత.                                                                                                అక్కిరాజు రమాపతిరావు         

Features

  • : Jeevana Vahini
  • : Akkiraju Ramapati Rao
  • : Emesco publishers
  • : EMESCO0099
  • : paperback
  • : 2015
  • : 398
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jeevana Vahini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam