Balala Sabda Ratnakaram

By Thoomati Donappa (Author)
Rs.100
Rs.100

Balala Sabda Ratnakaram
INR
VISHALA577
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         మనసులోని భావాలను నోటిమాటగా బైటపెట్టేదే భాష. తెలుగువారు మాట్లాడే భాష, తెలుగులేక తెనుగు. దీనికే 'ఆంధ్రం' అన్న పేరుకూడా ఉంది. రెండువేల సంవత్సరాల క్రితంనుంచే తెలుగుభాష ప్రజల వాడుకలో ఉంది. తెలుగువారితోపాటు వారి భాష కూడా పెరుగుతూ వచ్చింది. ఇలా పెరిగే దశలో సంస్కృతం, ప్రాకృతం, పార్శీ, కన్నడం, తమిళం, మరాఠీ, ఉర్దూ, ఒరియా, ఇంగ్లిషు మొదలైన భాషలతో దీనికి సంబంధం కలిగింది. అందువల్ల ఎన్నో మాటలను ఈ యీ భాషలనుంచి తెలుగువారు ఎరవుతెచ్చుకొని తమభాషను పెంచి పెద్దచేసుకున్నారు. సామాన్య ప్రజలేకాక, తెలుగు కవులు వారిని పోషించిన ప్రభువులు కూడా ఈ పెరుగుదలలో తోడ్పడ్డారు.

          ఇంగ్లిషువారి పరిపాలన వచ్చాక తెలుగు నిఘంటువుల రచనా పద్ధతి మారిపోయింది. అర్థాలలో మాటలను అకారాది క్రమంలో కూర్చి, నిఘంటువులను సిద్ధపరిచారు. కళాశాలల్లో విశ్వవిద్యాలయాల తరగతులలో చదివే విద్యార్థులకూ, పండితులకూ ఇవి ఎంతో ఉపయోగకరమైనవి. ఇవి పాఠశాలలోని బాలబాలికలకు అందుబాటులో లేనివి; అంతగా అవసరంలేనివి. పిల్లల 'చేతివెన్నెముద్దలు' గా చేతులలో ఇమిడిపోయే చిన్న చిన్న పుస్తకాలు వీరికి కావాలి. ఆ చూపుతో రూపెత్తినది ఈ నిఘంటువు.

          ఒకటినుంచి పదోతరగతి వరకూగల విద్యార్థుల పాఠ్యగ్రంథాలనూ, ముఖ్యంగా పాఠ్యాంశాలుగా నిర్ణయించే ప్రాచీన కావ్య భాగాలనూ పరిశీలించి అందలి కఠినపదాలను ఏర్చి, వాటిని అకారాదిక్రమంలో కూర్చి, వీలైనంత సులువైన రీతిలో వాటి అర్థాలు సూచించి దీనిని సిద్ధంచేశాము.

         మనసులోని భావాలను నోటిమాటగా బైటపెట్టేదే భాష. తెలుగువారు మాట్లాడే భాష, తెలుగులేక తెనుగు. దీనికే 'ఆంధ్రం' అన్న పేరుకూడా ఉంది. రెండువేల సంవత్సరాల క్రితంనుంచే తెలుగుభాష ప్రజల వాడుకలో ఉంది. తెలుగువారితోపాటు వారి భాష కూడా పెరుగుతూ వచ్చింది. ఇలా పెరిగే దశలో సంస్కృతం, ప్రాకృతం, పార్శీ, కన్నడం, తమిళం, మరాఠీ, ఉర్దూ, ఒరియా, ఇంగ్లిషు మొదలైన భాషలతో దీనికి సంబంధం కలిగింది. అందువల్ల ఎన్నో మాటలను ఈ యీ భాషలనుంచి తెలుగువారు ఎరవుతెచ్చుకొని తమభాషను పెంచి పెద్దచేసుకున్నారు. సామాన్య ప్రజలేకాక, తెలుగు కవులు వారిని పోషించిన ప్రభువులు కూడా ఈ పెరుగుదలలో తోడ్పడ్డారు.           ఇంగ్లిషువారి పరిపాలన వచ్చాక తెలుగు నిఘంటువుల రచనా పద్ధతి మారిపోయింది. అర్థాలలో మాటలను అకారాది క్రమంలో కూర్చి, నిఘంటువులను సిద్ధపరిచారు. కళాశాలల్లో విశ్వవిద్యాలయాల తరగతులలో చదివే విద్యార్థులకూ, పండితులకూ ఇవి ఎంతో ఉపయోగకరమైనవి. ఇవి పాఠశాలలోని బాలబాలికలకు అందుబాటులో లేనివి; అంతగా అవసరంలేనివి. పిల్లల 'చేతివెన్నెముద్దలు' గా చేతులలో ఇమిడిపోయే చిన్న చిన్న పుస్తకాలు వీరికి కావాలి. ఆ చూపుతో రూపెత్తినది ఈ నిఘంటువు.           ఒకటినుంచి పదోతరగతి వరకూగల విద్యార్థుల పాఠ్యగ్రంథాలనూ, ముఖ్యంగా పాఠ్యాంశాలుగా నిర్ణయించే ప్రాచీన కావ్య భాగాలనూ పరిశీలించి అందలి కఠినపదాలను ఏర్చి, వాటిని అకారాదిక్రమంలో కూర్చి, వీలైనంత సులువైన రీతిలో వాటి అర్థాలు సూచించి దీనిని సిద్ధంచేశాము.

Features

  • : Balala Sabda Ratnakaram
  • : Thoomati Donappa
  • : Abinandana Publishers
  • : VISHALA577
  • : Paperback
  • : 172
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Balala Sabda Ratnakaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam