Manake Teliyani Mana Rahasyalu

By Vasili Vasantha Kumar (Author)
Rs.100
Rs.100

Manake Teliyani Mana Rahasyalu
INR
MASTERYG27
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ప్రపంచంలో మనం ప్రతిబింబాలం

జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యక్షసాక్షులం.

బింబంలో స్పష్టంగా అగుపిస్తాం...

కానీ హృదయం కనిపించదు.

నీడలో రేఖామాత్రంగా ప్రతిఫలిస్తాం...

కానీ మనసు వినిపించదు.

ఇలా మనకు మానమే

స్పష్టంగా రూపాలం... అస్పష్టంగా నీడలం,

అయినా కాంతిప్రసరణతోనే

రూపం అయినా... నీడ అయినా...

అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలు ఎన్నెన్నో!

వినిపించే జీవితంలో వెలికిరాని రహస్యాలు ఇంకెన్నో!

సమస్య మనమైతే పరిష్కారం మన నీడే.

రెండింటిపైన కాంతిప్రసరణ జరగాలి

అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది

ఈ కాంతి వేగంలో

నా పదమైనా, పాదమైనా

ప్రతి ఒక్కరికి వెలుగుపరచటానికే

అక్షర సాక్షిగాను... ఆత్మ సాక్షిగాను.

              అక్షరాభ్యాసంనాడు ఓనామాలు దిద్దించినంతమాత్రాన మన బ్రతుకునూ తీర్చిదిద్దుతామంటే ఎలా? అక్షరాభ్యాసం వరకే మన అనుకరణ... బ్రతుకంతా స్వియాభివ్యక్తే. వందేళ్ళ బ్రతుకుకావ్యం సాగాల్సింది ఈ సెల్ఫ్ ఎక్స్ ప్రెషన్ తోనే. ఇటువంటి స్వకీయ వర్తనంలోనే మన నిర్వహణాసామర్ధ్యం అభివ్యక్తమవుతుండాలి. అందుకే ఎప్పటికి మనకు మనంగా వ్యక్తం కావలసిందే తప్ప మరొకరి నిర్వచనానికి అద్దం కాకూడదు. అప్పుడే మన బ్రతుకు అర్ధవంతమయ్యేది.

             సో, బ్రతుకు మనది... బ్రతుకును భారం అనుకోకుండా బ్రతకాల్సింది మనం... మెరుగు పెట్టాల్సింది మనం. అప్పుడే మన బ్రతుకు మెరుపవుతుంది. బ్రతుకు పుస్తకమే వెలుగవుతుంది. ఈ బ్రతుకు పుస్తకంలోని ఏ పుట తెరిచినా మన ఆలోచనలే, మన ఆచరణలే ఎటువంటివారినైనా అక్షరాల వెంట పరుగులు పెట్టించేవి కావాలి. అంతేకాని ఎవరి నిర్వచనాలకొ మనం నిలువెత్తు ప్రతిబింబాలుగా ఆ అక్షరాలలో వొదిగి కనిపించకూడదు.

           మన శక్తిని అంచనా వేయగల సామర్ధ్యం ఏ ఇతర మానవ శక్తులకూ లేదు ఎటునుండైనా మన జీవితాలను వెలకట్టగల షరాబులం మనమే.

- వాసిలి వసంతకుమార్

 

 

ప్రపంచంలో మనం ప్రతిబింబాలం జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యక్షసాక్షులం. బింబంలో స్పష్టంగా అగుపిస్తాం... కానీ హృదయం కనిపించదు. నీడలో రేఖామాత్రంగా ప్రతిఫలిస్తాం... కానీ మనసు వినిపించదు. ఇలా మనకు మానమే స్పష్టంగా రూపాలం... అస్పష్టంగా నీడలం, అయినా కాంతిప్రసరణతోనే రూపం అయినా... నీడ అయినా... అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలు ఎన్నెన్నో! వినిపించే జీవితంలో వెలికిరాని రహస్యాలు ఇంకెన్నో! సమస్య మనమైతే పరిష్కారం మన నీడే. రెండింటిపైన కాంతిప్రసరణ జరగాలి అప్పుడే బ్రతుకు వెలుతురు ముద్ద అవుతుంది ఈ కాంతి వేగంలో నా పదమైనా, పాదమైనా ప్రతి ఒక్కరికి వెలుగుపరచటానికే అక్షర సాక్షిగాను... ఆత్మ సాక్షిగాను.               అక్షరాభ్యాసంనాడు ఓనామాలు దిద్దించినంతమాత్రాన మన బ్రతుకునూ తీర్చిదిద్దుతామంటే ఎలా? అక్షరాభ్యాసం వరకే మన అనుకరణ... బ్రతుకంతా స్వియాభివ్యక్తే. వందేళ్ళ బ్రతుకుకావ్యం సాగాల్సింది ఈ సెల్ఫ్ ఎక్స్ ప్రెషన్ తోనే. ఇటువంటి స్వకీయ వర్తనంలోనే మన నిర్వహణాసామర్ధ్యం అభివ్యక్తమవుతుండాలి. అందుకే ఎప్పటికి మనకు మనంగా వ్యక్తం కావలసిందే తప్ప మరొకరి నిర్వచనానికి అద్దం కాకూడదు. అప్పుడే మన బ్రతుకు అర్ధవంతమయ్యేది.              సో, బ్రతుకు మనది... బ్రతుకును భారం అనుకోకుండా బ్రతకాల్సింది మనం... మెరుగు పెట్టాల్సింది మనం. అప్పుడే మన బ్రతుకు మెరుపవుతుంది. బ్రతుకు పుస్తకమే వెలుగవుతుంది. ఈ బ్రతుకు పుస్తకంలోని ఏ పుట తెరిచినా మన ఆలోచనలే, మన ఆచరణలే ఎటువంటివారినైనా అక్షరాల వెంట పరుగులు పెట్టించేవి కావాలి. అంతేకాని ఎవరి నిర్వచనాలకొ మనం నిలువెత్తు ప్రతిబింబాలుగా ఆ అక్షరాలలో వొదిగి కనిపించకూడదు.            మన శక్తిని అంచనా వేయగల సామర్ధ్యం ఏ ఇతర మానవ శక్తులకూ లేదు ఎటునుండైనా మన జీవితాలను వెలకట్టగల షరాబులం మనమే. - వాసిలి వసంతకుమార్    

Features

  • : Manake Teliyani Mana Rahasyalu
  • : Vasili Vasantha Kumar
  • : Yogalaya
  • : MASTERYG27
  • : Paperback
  • : February, 2014
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manake Teliyani Mana Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam