Samjikarangam lo Prathibamurthulu

By Sarada Bail (Author), Ravela Sambasiva Rao (Author)
Rs.50
Rs.50

Samjikarangam lo Prathibamurthulu
INR
ALAKANAN22
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఇవి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తుల కధలు తమ రంగాలలో వారు సాధించిన విజియాలు ఎంతో స్పూర్తిదాయకం. ఒక్కొక్క కధ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కధానాయకులుగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది.

సమాజంలోని అన్యాయాలను ఎదిరించి తమపాటి పౌరులకు తలఎత్తుకు జీవించే ధైర్యాన్ని ఇచ్చేందుకు ఉద్యమించిన పదిమంది సంఘసేవకుల కధలివి.

దేశంలోని వివిధ ప్రాంతాలలోని గిరిజనులతో కలసిన పనిచేయడం ద్వారాను తన రచనల ద్వారాను వారి దయనీయ జీవితాలను వెలుగులోకి తెచ్చిన ప్రతిభావంతురాలైన బెంగాలీ రచయిత్రి మహాశ్వేతా దేవి.

కుష్టురోగుల పట్ల సమాజంలో ఏవగింపును దూరంచేసేందుకు తన జీవితం ధారపోసి, వారికోసం ఒక ప్రత్యేక సమాజాన్నే నిర్మించిన బాబా ఆమ్టే.

చిప్కో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలచి, గడ్వాల్ లో అంతరిచిపోతున్న అటవీసంపదను కాపాడేందుకు నడుంబిగించిన చండీ ప్రసాద్ భట్.

అనాధపిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు దేశంలో ఎస్.ఓ.ఎస్.చిల్డ్రన్స్ విలేజెస్ ను స్థాపించిన జె.ఎన్.కౌల్

అహ్మదాబాద్ లోని మహిళా కార్మికులను సంఘటిత పరచి, వారి కోసం 'సేవా' సహకార సంఘాన్ని నెలకొల్పేందుకు సాహసం చేసిన ఇలా భట్.

పరిశుభ్రత, పారిశుధ్యం పట్ల విస్తృత అవగాహన కల్పించి 'సులభ్' మరుగుదొడ్లను ఏర్పాటు చేయడానికి పూనుకొన్న బిందేశ్వర్ పాఠక్.

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తున్నారో నలుగురుకీ తెలిసేలా సమాచారహక్కు కోసం ఉద్యమం నడిపిన అరుణా రాయ్.

అంతరించిన ఒక అడివిని మళ్ళి చిగురింపజేసి, నిరాశ్రయులైన అబలలకు ఆశ్రమం కల్పించిన మళయాళ కవయిత్రి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి సుగధ కుమారి.

రాజస్థాన్ పడమటి ప్రాంతంలో ఎండిపోయిన జలాశయాలను, నదులను నీటితో కళకళలాడేట్లు చేసిన  అపర భగీరధుడు రాజేంద్రసింగ్.

అవకాశాలను నోచుకోని నిర్భాగ్యులైన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మోడువారిన ఆ పసి జీవితాలను చిగురింపచేయడమే ధ్యేయంగా సాగుతున్న సందీప్ పాండే.

దృఢ దీక్షతో అంకితభావంతో సమాజాన్ని ప్రపంచాన్ని ఎలా మార్చగలరో వీటిలో ఒక్కో కధ ఒక పాటంలా మనకు తెలియచెప్తుంది.

- శారద బెయిల్

 

ఇవి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తుల కధలు తమ రంగాలలో వారు సాధించిన విజియాలు ఎంతో స్పూర్తిదాయకం. ఒక్కొక్క కధ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కధానాయకులుగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది. సమాజంలోని అన్యాయాలను ఎదిరించి తమపాటి పౌరులకు తలఎత్తుకు జీవించే ధైర్యాన్ని ఇచ్చేందుకు ఉద్యమించిన పదిమంది సంఘసేవకుల కధలివి. దేశంలోని వివిధ ప్రాంతాలలోని గిరిజనులతో కలసిన పనిచేయడం ద్వారాను తన రచనల ద్వారాను వారి దయనీయ జీవితాలను వెలుగులోకి తెచ్చిన ప్రతిభావంతురాలైన బెంగాలీ రచయిత్రి మహాశ్వేతా దేవి. కుష్టురోగుల పట్ల సమాజంలో ఏవగింపును దూరంచేసేందుకు తన జీవితం ధారపోసి, వారికోసం ఒక ప్రత్యేక సమాజాన్నే నిర్మించిన బాబా ఆమ్టే. చిప్కో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలచి, గడ్వాల్ లో అంతరిచిపోతున్న అటవీసంపదను కాపాడేందుకు నడుంబిగించిన చండీ ప్రసాద్ భట్. అనాధపిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు దేశంలో ఎస్.ఓ.ఎస్.చిల్డ్రన్స్ విలేజెస్ ను స్థాపించిన జె.ఎన్.కౌల్ అహ్మదాబాద్ లోని మహిళా కార్మికులను సంఘటిత పరచి, వారి కోసం 'సేవా' సహకార సంఘాన్ని నెలకొల్పేందుకు సాహసం చేసిన ఇలా భట్. పరిశుభ్రత, పారిశుధ్యం పట్ల విస్తృత అవగాహన కల్పించి 'సులభ్' మరుగుదొడ్లను ఏర్పాటు చేయడానికి పూనుకొన్న బిందేశ్వర్ పాఠక్. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తున్నారో నలుగురుకీ తెలిసేలా సమాచారహక్కు కోసం ఉద్యమం నడిపిన అరుణా రాయ్. అంతరించిన ఒక అడివిని మళ్ళి చిగురింపజేసి, నిరాశ్రయులైన అబలలకు ఆశ్రమం కల్పించిన మళయాళ కవయిత్రి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి సుగధ కుమారి. రాజస్థాన్ పడమటి ప్రాంతంలో ఎండిపోయిన జలాశయాలను, నదులను నీటితో కళకళలాడేట్లు చేసిన  అపర భగీరధుడు రాజేంద్రసింగ్. అవకాశాలను నోచుకోని నిర్భాగ్యులైన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మోడువారిన ఆ పసి జీవితాలను చిగురింపచేయడమే ధ్యేయంగా సాగుతున్న సందీప్ పాండే. దృఢ దీక్షతో అంకితభావంతో సమాజాన్ని ప్రపంచాన్ని ఎలా మార్చగలరో వీటిలో ఒక్కో కధ ఒక పాటంలా మనకు తెలియచెప్తుంది. - శారద బెయిల్  

Features

  • : Samjikarangam lo Prathibamurthulu
  • : Sarada Bail
  • : Alakakanda
  • : ALAKANAN22
  • : Paperback
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samjikarangam lo Prathibamurthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam