Nalupu, Telupu, Konni Rangulu

Rs.120
Rs.120

Nalupu, Telupu, Konni Rangulu
INR
NAVOPH0222
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                    భారతదేశంలో కేంద్ర సాహిత్య అకాడెమీ గుర్తించిన 24 భాషల రచయితలకు ఒకరి గురించి మరొకరికి తెలిసింది. చాలా తక్కువ. మనకు విదేశీ భాషలైన రష్యన్, చైనీస్, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్, స్పానిష్ భాషల సాహిత్యం ఆంగ్లం ద్వారా అనువాదమై ఎన్నో దశాబ్దాలుగా అందుతూనే ఉంది. అక్కడ జరిగే ప్రతీ సాహిత్య ఉద్యమమూ మనకు తెలుసు. అందులో మనం స్వంతం చేసుకున్నవీ గుర్తించగలం. విశ్లేషించగలం కానీ మన పొరుగున ఉన్న కన్నడం, తమిళం, మలయాళం, ఒరియా, మరాఠీ తదితర భాషల సాహిత్యం గురించి తెలిసింది చాలా తక్కువే. తెలుగు సాహిత్యంలో వచ్చిన ధోరణులు, ఉద్యమాలు ఈ భాషలో కూడా వచ్చే ఉంటాయని అనుకుంటాంగానీ, వాటికీ సంబంధించిన సాహిత్యం చాలా స్వల్పంగా మాత్రమే మన భాషలో లభిస్తుంది. అందుకే ఈ భాషల నుంచి అనువాదాలను ఎక్కువ ఆహ్వానించడం మనం చేయాల్సిన పని.

                 కన్నడం నుంచి తెలుగుకు అనువదించిన చక్కని అనువాదకులు లేకపోలేదు. ఆర్వీయస్ సుందరంగారు, జి.ఎస్. మోహన్ గారూ, డా. పి. భార్గవిగారూ, శార్వాణిగారు, గంగిశెట్టి లక్ష్మి నారాయణగారు వంటి కొందరు, గొప్ప కన్నడ రచనలకు మనకిచ్చారు - ఇప్పుడు రంగనాధ రామచంద్రరావుగారు ఆ ఒరవడిలో ఆ పని చేసి తెలుగువారికీ, కన్నడిగులకు కూడా మేలు చేశారు. 

                 ఇందులోని కధలన్నీ స్త్రీలు రాసినవే. ఇంతకు పూర్వం కన్నడ కల్పనా సాహిత్య రచయితలంటే మాస్తి వెంకటేశ్ అయ్యంగార్, లంకేశ్, స్త్రీలలో అయితే త్రివేణి వంటి కొందరే పరిచయం ఉండేవారు. అందుకే ఇప్పుడు ఈ రచయిత్రులను పరిచయం చేసి, రంగనాధ రామచంద్రరావుగారు మనకు కన్నడ రచయిత్రుల కధల్లోని మేలిమిని చూపగలిగారు.

                 ఈ కధలన్నీ చదివాక ఎక్కువ శాతం కధల్లో ఉన్న పాజిటివ్ దృక్పధం మనల్ని ఆకట్టుకుంటుంది. మనుషుల్లో మంచితనంపైనా, జీవితాన్ని ఎదుర్కోవడంలో వారికున్న ధైర్యంపైనా, నమ్మకం కలిగించే దృష్టి ఈ కధల్లో ఉంది. కధలు చెప్పిన విధానంలో ఎక్కడా అనవసర భేషజాలు, కృత్రిమ శిల్పాలు లేవు. హాయిగా చదివించే కధలు. దానికి ముఖ్య కారణం రంగనాధ రామచంద్రరావుగారి అనువాదమే చెప్పాలి. సరళంగా, చక్కగా వున్న అనువాదం వల్ల పఠనీయత సమృద్ధిగా ఉంది

- డా. మృణాళిని

                    భారతదేశంలో కేంద్ర సాహిత్య అకాడెమీ గుర్తించిన 24 భాషల రచయితలకు ఒకరి గురించి మరొకరికి తెలిసింది. చాలా తక్కువ. మనకు విదేశీ భాషలైన రష్యన్, చైనీస్, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్, స్పానిష్ భాషల సాహిత్యం ఆంగ్లం ద్వారా అనువాదమై ఎన్నో దశాబ్దాలుగా అందుతూనే ఉంది. అక్కడ జరిగే ప్రతీ సాహిత్య ఉద్యమమూ మనకు తెలుసు. అందులో మనం స్వంతం చేసుకున్నవీ గుర్తించగలం. విశ్లేషించగలం కానీ మన పొరుగున ఉన్న కన్నడం, తమిళం, మలయాళం, ఒరియా, మరాఠీ తదితర భాషల సాహిత్యం గురించి తెలిసింది చాలా తక్కువే. తెలుగు సాహిత్యంలో వచ్చిన ధోరణులు, ఉద్యమాలు ఈ భాషలో కూడా వచ్చే ఉంటాయని అనుకుంటాంగానీ, వాటికీ సంబంధించిన సాహిత్యం చాలా స్వల్పంగా మాత్రమే మన భాషలో లభిస్తుంది. అందుకే ఈ భాషల నుంచి అనువాదాలను ఎక్కువ ఆహ్వానించడం మనం చేయాల్సిన పని.                  కన్నడం నుంచి తెలుగుకు అనువదించిన చక్కని అనువాదకులు లేకపోలేదు. ఆర్వీయస్ సుందరంగారు, జి.ఎస్. మోహన్ గారూ, డా. పి. భార్గవిగారూ, శార్వాణిగారు, గంగిశెట్టి లక్ష్మి నారాయణగారు వంటి కొందరు, గొప్ప కన్నడ రచనలకు మనకిచ్చారు - ఇప్పుడు రంగనాధ రామచంద్రరావుగారు ఆ ఒరవడిలో ఆ పని చేసి తెలుగువారికీ, కన్నడిగులకు కూడా మేలు చేశారు.                   ఇందులోని కధలన్నీ స్త్రీలు రాసినవే. ఇంతకు పూర్వం కన్నడ కల్పనా సాహిత్య రచయితలంటే మాస్తి వెంకటేశ్ అయ్యంగార్, లంకేశ్, స్త్రీలలో అయితే త్రివేణి వంటి కొందరే పరిచయం ఉండేవారు. అందుకే ఇప్పుడు ఈ రచయిత్రులను పరిచయం చేసి, రంగనాధ రామచంద్రరావుగారు మనకు కన్నడ రచయిత్రుల కధల్లోని మేలిమిని చూపగలిగారు.                  ఈ కధలన్నీ చదివాక ఎక్కువ శాతం కధల్లో ఉన్న పాజిటివ్ దృక్పధం మనల్ని ఆకట్టుకుంటుంది. మనుషుల్లో మంచితనంపైనా, జీవితాన్ని ఎదుర్కోవడంలో వారికున్న ధైర్యంపైనా, నమ్మకం కలిగించే దృష్టి ఈ కధల్లో ఉంది. కధలు చెప్పిన విధానంలో ఎక్కడా అనవసర భేషజాలు, కృత్రిమ శిల్పాలు లేవు. హాయిగా చదివించే కధలు. దానికి ముఖ్య కారణం రంగనాధ రామచంద్రరావుగారి అనువాదమే చెప్పాలి. సరళంగా, చక్కగా వున్న అనువాదం వల్ల పఠనీయత సమృద్ధిగా ఉంది - డా. మృణాళిని

Features

  • : Nalupu, Telupu, Konni Rangulu
  • : Ranganatha Ramachandra Rao
  • : Lakshmi Prachuranalu
  • : NAVOPH0222
  • : Paperback
  • : October, 2013
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nalupu, Telupu, Konni Rangulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam