Devudu

By Osho (Author)
Rs.225
Rs.225

Devudu
INR
OSHOPBLI38
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               మీలోని భయం, ఆందోళన, భయంకర అభద్రతా భావాలకు ప్రతిరూపమే దేవుడు. వాటివల్లే ప్రార్థనపుడుతుంది. మతాచార్యుడు వస్తాడు. వ్యవస్థికృత మతం తయారవుతుంది. చర్చిలు, దేవాలయాలు, మసీదులు వెలుస్తాయి. కాబట్టి, అంతిమ అసత్యం దేవుడే. అందుకే వాడి చుట్టూ అనేక అసత్యాలు అల్లుకున్నాయి. ఎందుకంటే, అసత్యం ఒంటరిగా జీవించలేదు. దాని మనుగడకు అనేక అసత్యాల తోడు కావాలి. అందుకే దైవాధార మతాలన్నీ అంతిమ అసత్యమైన దేవునికి ఆలంబనగా అనేక అసత్యాలను సృష్టించాయి. దేవుడు ఒక కట్టుకధ. కాబట్టి, దేవునిపై ఆధారపడినదేదైనా అసత్యమే.

             దేవునితో పెట్టుకుంటే మనిషి బానిస అయినట్లే. మహా అహంకారపరులైన ఎందుకూ పనికిరాని రక్షకులను, ప్రవక్తలను, మహాపురుషులను గుడ్డిగా నమ్ముతూ పవిత్ర గ్రంథాల ముందు, రాతి శిల్పాల ముందు, మట్టి విగ్రహాల ముందు బానిసలా మోకరిల్లి దేవుని ప్రార్ధిస్తూ బిచ్చగాడిలా అడుక్కోవలసిందే. మొత్తం మానవాళి ఒక గొప్ప ఆధ్యాత్మిక బానిసత్వం దిశగా పురిగొల్పబడింది.  

             దేవుడు లక్షలాది ప్రజలను బందీలుగా చేసి వారిని వారి చైతన్యానికి దూరం చేస్తున్నాడు. కాబట్టి, దేవుణ్ణి వదిలించుకోనంతవరకు మీరు దీనాతిదీనంగా జీవించాల్సిందే. అందుకే దేవుణ్ణి తీసెయ్యాలి. అదే గొప్ప తిరుగుబాటు. దేవుణ్ణి దైర్యంగా వదిలేయండి. అలా చేసిన వెంటనే మీరు చాలా స్తిమితపడినట్లు, చాలా సహజంగా ఉన్నట్లు తెలుసుకుంటారు. అంతేకాదు, ఇతర జీవాలన్నింటికి లభించనట్లుగానే మీకు కూడా చక్కని సౌందర్యం లభిస్తుంది.

            దేవుని భావనకన్నా మెరుగైనదాన్ని సృస్టించలేకపోయిన మనిషి ఏమంత సృజనాత్మకమైనవాడు కాదు. ఒకవేళ అలా సృస్టించగలిగినా అది కూడా కాస్త మెరుగైన కట్టుకధే అవుతుంది. మెరుగైన దేవుడు మెరుగైన జైలు లాంటి వాడు. అంతేకాదు, వాడు మరింత బలమైన గొలుసు లాంటి వాడు. కాబట్టి, మెరుగైన దేవుడు మామూలు దేవుళ్ళకన్నా మరింత మెరుగైన చాకచక్యంతో మిమ్మల్ని ముంచేస్తాడు. మరి మీకు మెరుగైన దేవుడు, మెరుగైన జైలు, మెరుగైన విషం కావాలా?

- ఓషో  

               మీలోని భయం, ఆందోళన, భయంకర అభద్రతా భావాలకు ప్రతిరూపమే దేవుడు. వాటివల్లే ప్రార్థనపుడుతుంది. మతాచార్యుడు వస్తాడు. వ్యవస్థికృత మతం తయారవుతుంది. చర్చిలు, దేవాలయాలు, మసీదులు వెలుస్తాయి. కాబట్టి, అంతిమ అసత్యం దేవుడే. అందుకే వాడి చుట్టూ అనేక అసత్యాలు అల్లుకున్నాయి. ఎందుకంటే, అసత్యం ఒంటరిగా జీవించలేదు. దాని మనుగడకు అనేక అసత్యాల తోడు కావాలి. అందుకే దైవాధార మతాలన్నీ అంతిమ అసత్యమైన దేవునికి ఆలంబనగా అనేక అసత్యాలను సృష్టించాయి. దేవుడు ఒక కట్టుకధ. కాబట్టి, దేవునిపై ఆధారపడినదేదైనా అసత్యమే.              దేవునితో పెట్టుకుంటే మనిషి బానిస అయినట్లే. మహా అహంకారపరులైన ఎందుకూ పనికిరాని రక్షకులను, ప్రవక్తలను, మహాపురుషులను గుడ్డిగా నమ్ముతూ పవిత్ర గ్రంథాల ముందు, రాతి శిల్పాల ముందు, మట్టి విగ్రహాల ముందు బానిసలా మోకరిల్లి దేవుని ప్రార్ధిస్తూ బిచ్చగాడిలా అడుక్కోవలసిందే. మొత్తం మానవాళి ఒక గొప్ప ఆధ్యాత్మిక బానిసత్వం దిశగా పురిగొల్పబడింది.                దేవుడు లక్షలాది ప్రజలను బందీలుగా చేసి వారిని వారి చైతన్యానికి దూరం చేస్తున్నాడు. కాబట్టి, దేవుణ్ణి వదిలించుకోనంతవరకు మీరు దీనాతిదీనంగా జీవించాల్సిందే. అందుకే దేవుణ్ణి తీసెయ్యాలి. అదే గొప్ప తిరుగుబాటు. దేవుణ్ణి దైర్యంగా వదిలేయండి. అలా చేసిన వెంటనే మీరు చాలా స్తిమితపడినట్లు, చాలా సహజంగా ఉన్నట్లు తెలుసుకుంటారు. అంతేకాదు, ఇతర జీవాలన్నింటికి లభించనట్లుగానే మీకు కూడా చక్కని సౌందర్యం లభిస్తుంది.             దేవుని భావనకన్నా మెరుగైనదాన్ని సృస్టించలేకపోయిన మనిషి ఏమంత సృజనాత్మకమైనవాడు కాదు. ఒకవేళ అలా సృస్టించగలిగినా అది కూడా కాస్త మెరుగైన కట్టుకధే అవుతుంది. మెరుగైన దేవుడు మెరుగైన జైలు లాంటి వాడు. అంతేకాదు, వాడు మరింత బలమైన గొలుసు లాంటి వాడు. కాబట్టి, మెరుగైన దేవుడు మామూలు దేవుళ్ళకన్నా మరింత మెరుగైన చాకచక్యంతో మిమ్మల్ని ముంచేస్తాడు. మరి మీకు మెరుగైన దేవుడు, మెరుగైన జైలు, మెరుగైన విషం కావాలా? - ఓషో  

Features

  • : Devudu
  • : Osho
  • : Dhyana Jyothi Publications
  • : OSHOPBLI38
  • : Paperback
  • : December 2013
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Devudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam