Kasi Kandamu

Rs.450
Rs.450

Kasi Kandamu
INR
GOLLAPUD96
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              కాశీ అంటే ఏమిటి? కాశీ బ్రహ్మాండమండలి పుణ్యక్షేత్రము లన్నింటి కంటె ఎందువలన గొప్పది? కాశీ యందు ప్రధానలింగములేవి? విశ్వేశ్వరాది సిద్ధలింగముల ప్రాముఖ్యతము ఎటువంటి ఇది? గంగా, మణికర్ణికాది తీర్ధముల మహిమ ఏమిటి? భవానీమాత (అన్నపూర్ణ) విశాలాక్షి ఆదిగా గల దేవీమూర్తుల ప్రాశస్త్యమేమిటి? కాలభైరవుడు, దండపాణి ఎవరు? డుంఢి గణపతి మూర్తుల విశిష్ట ఏమిటి? ఆదికేశవ, బిందుమాధవాది విష్ణుమూర్తుల ప్రభావమేమిటి? కాశీయాత్ర, కాశీనివాసము, కాశీమరణము వలన ప్రయోజనములేవి? ఎందువలన కాశీలో ముక్తి సులభ సాధ్యము? కాశీ యాత్రను ఏ విధముగ చేయాలి? కాశీయందు ఎక్కడెక్కడ ఏమేమి దర్శించాలి? కాశీ, కాశీదేవతలా స్తోత్రాలు ఏవి? మున్నగు కాశీ సమగ్ర సమాచార సందర్శిని ఈ గ్రంధము.

               ఇందలి భాష సామాన్యులకు కూడా అర్ధమగు రీతిగా ఈ గ్రంధం అందించటం జరిగింది.

- మల్లాది శ్రీహరి శాస్త్రి

               జ్ఞానము వలన మాత్రమే జీవుని బ్రాంతితొలగి స్వస్థితి అయిన మోక్షానుభవము కలుగగలదు. జ్ఞానము తప్ప మిగిలిన మార్గములన్నియు క్రమముక్తిని మాత్రమే ప్రసాదించగలవు.

              క్రమముక్తిని కలిగించే మార్గములలో నియమపూరితమైన క్షేత్రవాస మొకటి. క్షేత్రము యొక్క మహాత్త్వము వలన సాధన త్వరితగతిన ఫలితమీయగలదు. ఉత్తర వాహిని గంగ ప్రవహించే విశ్వనాధుని కాశీ మహాక్షేత్రం, చరిత్ర కందని కాలం నుండి భారతదేశపు ఆద్యాత్మిక రాజధాని - కాశిలో కొలది కాలమైన ఆవాసము చేయవలెనన్నది సగటు భారతీయ ఆస్తికుని ఆకాంక్ష. కాశీలోని ప్రతి అంగుళము మహామహిమోపేతమైన పుణ్యస్థలము.

             కాశీక్షేత్రమహాత్త్వమును వర్ణించిన పురాణములలో స్కాందము ముఖ్యమైనది. ఇందున్న కాశీఖండము కాశీనగర చరిత్ర, కాశీలోని దలచినవారు ఆ క్షేత్రపు మహాత్త్వము, దర్శనీయ ప్రదేశములు, వాటి చరిత్ర, ఆ క్షేత్రములలో చేయదగిన లేక చేయకూడని పనులు తెలుసుకొనుట అత్యంత ఆవశ్యకము.

            సంస్కృతాంద్రోపన్యాసకులుగ పదవీవిరమణ చేసి గుంటూరులోని మా దేవాలయములో కైంకర్యముతోపాటు ధర్మప్రచారములో ఇతోధికమైన సేవ చేస్తున్న శ్రీమల్లాది శ్రీహరిశాస్త్రి గారు కాశీవాసులుగా ఉండే తెలుగువారి కోసము, కాశీఖందమును స్వేచ్చానువాదం చేసి దానితోపాటు యాత్రికులకు అవసరమైన యాత్రాదర్శినిని, కాశీక్షేత్రమునకు సంబంధించిన ముఖ్యస్తోత్రములను చేర్చి ఒక గ్రంథంగా తీసుకుని రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలుగు ఆస్తికులకు ఇది ఎంతో ఉపకారము కాగలదు. 

- శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి 

              కాశీ అంటే ఏమిటి? కాశీ బ్రహ్మాండమండలి పుణ్యక్షేత్రము లన్నింటి కంటె ఎందువలన గొప్పది? కాశీ యందు ప్రధానలింగములేవి? విశ్వేశ్వరాది సిద్ధలింగముల ప్రాముఖ్యతము ఎటువంటి ఇది? గంగా, మణికర్ణికాది తీర్ధముల మహిమ ఏమిటి? భవానీమాత (అన్నపూర్ణ) విశాలాక్షి ఆదిగా గల దేవీమూర్తుల ప్రాశస్త్యమేమిటి? కాలభైరవుడు, దండపాణి ఎవరు? డుంఢి గణపతి మూర్తుల విశిష్ట ఏమిటి? ఆదికేశవ, బిందుమాధవాది విష్ణుమూర్తుల ప్రభావమేమిటి? కాశీయాత్ర, కాశీనివాసము, కాశీమరణము వలన ప్రయోజనములేవి? ఎందువలన కాశీలో ముక్తి సులభ సాధ్యము? కాశీ యాత్రను ఏ విధముగ చేయాలి? కాశీయందు ఎక్కడెక్కడ ఏమేమి దర్శించాలి? కాశీ, కాశీదేవతలా స్తోత్రాలు ఏవి? మున్నగు కాశీ సమగ్ర సమాచార సందర్శిని ఈ గ్రంధము.                ఇందలి భాష సామాన్యులకు కూడా అర్ధమగు రీతిగా ఈ గ్రంధం అందించటం జరిగింది. - మల్లాది శ్రీహరి శాస్త్రి                జ్ఞానము వలన మాత్రమే జీవుని బ్రాంతితొలగి స్వస్థితి అయిన మోక్షానుభవము కలుగగలదు. జ్ఞానము తప్ప మిగిలిన మార్గములన్నియు క్రమముక్తిని మాత్రమే ప్రసాదించగలవు.               క్రమముక్తిని కలిగించే మార్గములలో నియమపూరితమైన క్షేత్రవాస మొకటి. క్షేత్రము యొక్క మహాత్త్వము వలన సాధన త్వరితగతిన ఫలితమీయగలదు. ఉత్తర వాహిని గంగ ప్రవహించే విశ్వనాధుని కాశీ మహాక్షేత్రం, చరిత్ర కందని కాలం నుండి భారతదేశపు ఆద్యాత్మిక రాజధాని - కాశిలో కొలది కాలమైన ఆవాసము చేయవలెనన్నది సగటు భారతీయ ఆస్తికుని ఆకాంక్ష. కాశీలోని ప్రతి అంగుళము మహామహిమోపేతమైన పుణ్యస్థలము.              కాశీక్షేత్రమహాత్త్వమును వర్ణించిన పురాణములలో స్కాందము ముఖ్యమైనది. ఇందున్న కాశీఖండము కాశీనగర చరిత్ర, కాశీలోని దలచినవారు ఆ క్షేత్రపు మహాత్త్వము, దర్శనీయ ప్రదేశములు, వాటి చరిత్ర, ఆ క్షేత్రములలో చేయదగిన లేక చేయకూడని పనులు తెలుసుకొనుట అత్యంత ఆవశ్యకము.             సంస్కృతాంద్రోపన్యాసకులుగ పదవీవిరమణ చేసి గుంటూరులోని మా దేవాలయములో కైంకర్యముతోపాటు ధర్మప్రచారములో ఇతోధికమైన సేవ చేస్తున్న శ్రీమల్లాది శ్రీహరిశాస్త్రి గారు కాశీవాసులుగా ఉండే తెలుగువారి కోసము, కాశీఖందమును స్వేచ్చానువాదం చేసి దానితోపాటు యాత్రికులకు అవసరమైన యాత్రాదర్శినిని, కాశీక్షేత్రమునకు సంబంధించిన ముఖ్యస్తోత్రములను చేర్చి ఒక గ్రంథంగా తీసుకుని రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలుగు ఆస్తికులకు ఇది ఎంతో ఉపకారము కాగలదు.  - శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి 

Features

  • : Kasi Kandamu
  • : Malladi Srihari Sastry
  • : Gollapudi
  • : GOLLAPUD96
  • : Hardbound
  • : Reprinting, 2014
  • : 498
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kasi Kandamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam