Mulika Prapancham

By K Acchireddy (Author)
Rs.90
Rs.90

Mulika Prapancham
INR
NAVOPH0194
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             భగవత్ సృష్టిలో మొదటి ప్రాణి మొక్కగానే చెప్పుకోవాలి. మొక్క తర్వాతే మిగిలిన ప్రాణులు ఆవిర్భవించాయి. మొక్కలకు జీవం ఉన్నది. జీవం అంటే ప్రాణం. మొక్కలను అద్భుతమైన శక్తి వనరులుగా భావించి పూజించటం మనకు చెల్లింది.

           మొక్కలకు ప్రాణం ఉందని ఆధునిక కాలంలో సర్ జగదీష్ చంద్రబోస్ అనే భారతీయ శాస్త్రవేత్త నిరూపించినాడు. మొక్కలకు ప్రాణం ఉండటమే కాదు. వాటికీ స్పందన కూడా ఉంటుందని ప్రయోగాలతో సహా నిరూపించాడు. కర్ణకఠోరంగా ఉండే పాశ్చాత్య సంగీత ప్రకంపనలకు మొక్కలు వాడిపోయాయి.శ్రావ్యమైన భారతీయ శాస్త్రీయ సంగీతానికి మొక్కలు వికసించుకున్నాయి.  మొక్కల యొక్క ఉనికిని శాస్త్రీయంగా అంచనావేయటం జరిగింది.

          అదే విధంగా మొక్కలు మనుషులకు అన్నివిధాలుగా ఉపయోగపడతాయి. ఆహారాన్నిస్తాయి. నీడనిస్తాయి. కలపనిస్తాయి. ప్రాణవాయువుని అందిస్తాయి. వర్షాన్నిస్తాయి. మొక్కల్లో చాలా రకాలు, మానవులకు ఉపయోగపడేవిగా ఉన్నాయి. జౌషధీమొక్కలు, ఫలాలను, పువ్వులను, ఆహారాన్ని, కలపనిచ్చే మొక్కలు అందరికీ తెలిసినవే. జౌషధీమొక్కల గురించి బహుళ జన సామాన్యానికి అంతగా తెలియదు. వీటితో పాటుగా మొక్కలకు జ్యోతిష్యశాస్త్రంలో ప్రముఖ పాత్ర ఉన్నదంటే వినేవారికి ఆశ్చర్యంగా ఉంటుంది. వీటినే మూలికలని అంటారు.ఈ పుస్తకంలో మూలికలను ఉపయోగించి నిజజీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలకు సులభరీతిలో పరిష్కారం ఎట్లా చేసుకోనవచ్చునో తెలియజేయుట జరిగినది. మొక్కలు వాటి వలన కలుగు ఫలితములను తెలియజేసినాము. మనం అందరం విచారించవలసిన విషయం ఏమిటంటే దట్టమైన అడవులు తరిగిపోవటం.

         ఇప్పటికైనా మేల్కొని వనాలను పెంచటం ప్రారంభించాలి. లేదంటే మనిషి మనుగడే ప్రశ్నార్ధకమయ్యే ప్రమాదమున్నది. వృక్షోరక్షతి రక్షితః అన్నవేద సూక్తి అసామాన్యమైనది. మొక్కల్ని పెంచుదాం. మన ఆయుష్షుని పెంచుకుందాం. మొక్కలు నాటుదాం భవిష్యత్ తరాలకి పూలబాట వేద్దాం 

         జ్యోతిష్యశాస్త్రంలో 27 నక్షత్ర జాతకులకు శుభాన్ని కలిగించే మొక్కల గురించి మన పూర్వీకులు తెలియజేసి ఉన్నారు. మొక్కలను శక్తి రూపాలు పూజించటం మన సంస్కృతిలో ఒకభాగం. తులసిచెట్టును, వేపచెట్టును, మర్రిచెట్టు, రావిచెట్టు  వంటి మొదలైన వృక్షాలను పూజించటం సర్వ సాధారణమైన అంశం. ఈ విషయం ద్వారా మనకు తెలిసి వచ్చేది ఏమంటే మొక్కకు మనిషికి విడదీయలేనంత అవినాభావ సంబంధం ఉన్నది. మొక్క దైవశక్తికి ప్రతీక. వృక్షాలకు గల గుణాలన్నీ దైనిక గుణాలే. త్యాగం, సమర్పణ, నిరంతర అభివృద్ధి, ఆశ్రయమిచ్చుట, పరోపకార స్వభావం, హాని చేయకపోవటం వంటివి శాస్త్రీయమైన విషయాలు వాటిని చూసి నేర్చుకోవాలి.

        అంతటి, మహిమాన్వితమైన మొక్కల గురించి, వాటి తాంత్రిక శక్తుల గురించి సవివరంగా పాఠక దేవుళ్ళకోసం అందిస్తునాము. చదివి, ఆచరించి ధన్యులు కాగలరు.

- కె. అచ్చిరెడ్డి 

             భగవత్ సృష్టిలో మొదటి ప్రాణి మొక్కగానే చెప్పుకోవాలి. మొక్క తర్వాతే మిగిలిన ప్రాణులు ఆవిర్భవించాయి. మొక్కలకు జీవం ఉన్నది. జీవం అంటే ప్రాణం. మొక్కలను అద్భుతమైన శక్తి వనరులుగా భావించి పూజించటం మనకు చెల్లింది.            మొక్కలకు ప్రాణం ఉందని ఆధునిక కాలంలో సర్ జగదీష్ చంద్రబోస్ అనే భారతీయ శాస్త్రవేత్త నిరూపించినాడు. మొక్కలకు ప్రాణం ఉండటమే కాదు. వాటికీ స్పందన కూడా ఉంటుందని ప్రయోగాలతో సహా నిరూపించాడు. కర్ణకఠోరంగా ఉండే పాశ్చాత్య సంగీత ప్రకంపనలకు మొక్కలు వాడిపోయాయి.శ్రావ్యమైన భారతీయ శాస్త్రీయ సంగీతానికి మొక్కలు వికసించుకున్నాయి.  మొక్కల యొక్క ఉనికిని శాస్త్రీయంగా అంచనావేయటం జరిగింది.           అదే విధంగా మొక్కలు మనుషులకు అన్నివిధాలుగా ఉపయోగపడతాయి. ఆహారాన్నిస్తాయి. నీడనిస్తాయి. కలపనిస్తాయి. ప్రాణవాయువుని అందిస్తాయి. వర్షాన్నిస్తాయి. మొక్కల్లో చాలా రకాలు, మానవులకు ఉపయోగపడేవిగా ఉన్నాయి. జౌషధీమొక్కలు, ఫలాలను, పువ్వులను, ఆహారాన్ని, కలపనిచ్చే మొక్కలు అందరికీ తెలిసినవే. జౌషధీమొక్కల గురించి బహుళ జన సామాన్యానికి అంతగా తెలియదు. వీటితో పాటుగా మొక్కలకు జ్యోతిష్యశాస్త్రంలో ప్రముఖ పాత్ర ఉన్నదంటే వినేవారికి ఆశ్చర్యంగా ఉంటుంది. వీటినే మూలికలని అంటారు.ఈ పుస్తకంలో మూలికలను ఉపయోగించి నిజజీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలకు సులభరీతిలో పరిష్కారం ఎట్లా చేసుకోనవచ్చునో తెలియజేయుట జరిగినది. మొక్కలు వాటి వలన కలుగు ఫలితములను తెలియజేసినాము. మనం అందరం విచారించవలసిన విషయం ఏమిటంటే దట్టమైన అడవులు తరిగిపోవటం.          ఇప్పటికైనా మేల్కొని వనాలను పెంచటం ప్రారంభించాలి. లేదంటే మనిషి మనుగడే ప్రశ్నార్ధకమయ్యే ప్రమాదమున్నది. వృక్షోరక్షతి రక్షితః అన్నవేద సూక్తి అసామాన్యమైనది. మొక్కల్ని పెంచుదాం. మన ఆయుష్షుని పెంచుకుందాం. మొక్కలు నాటుదాం భవిష్యత్ తరాలకి పూలబాట వేద్దాం           జ్యోతిష్యశాస్త్రంలో 27 నక్షత్ర జాతకులకు శుభాన్ని కలిగించే మొక్కల గురించి మన పూర్వీకులు తెలియజేసి ఉన్నారు. మొక్కలను శక్తి రూపాలు పూజించటం మన సంస్కృతిలో ఒకభాగం. తులసిచెట్టును, వేపచెట్టును, మర్రిచెట్టు, రావిచెట్టు  వంటి మొదలైన వృక్షాలను పూజించటం సర్వ సాధారణమైన అంశం. ఈ విషయం ద్వారా మనకు తెలిసి వచ్చేది ఏమంటే మొక్కకు మనిషికి విడదీయలేనంత అవినాభావ సంబంధం ఉన్నది. మొక్క దైవశక్తికి ప్రతీక. వృక్షాలకు గల గుణాలన్నీ దైనిక గుణాలే. త్యాగం, సమర్పణ, నిరంతర అభివృద్ధి, ఆశ్రయమిచ్చుట, పరోపకార స్వభావం, హాని చేయకపోవటం వంటివి శాస్త్రీయమైన విషయాలు వాటిని చూసి నేర్చుకోవాలి.         అంతటి, మహిమాన్వితమైన మొక్కల గురించి, వాటి తాంత్రిక శక్తుల గురించి సవివరంగా పాఠక దేవుళ్ళకోసం అందిస్తునాము. చదివి, ఆచరించి ధన్యులు కాగలరు. - కె. అచ్చిరెడ్డి 

Features

  • : Mulika Prapancham
  • : K Acchireddy
  • : Saitrisakthi Nilayam
  • : NAVOPH0194
  • : Paperback
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mulika Prapancham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam