Dhakshina Barathadesamlo Gramadevatalu

By Henry White Head (Author), Anandesi Nagaraju (Author)
Rs.80
Rs.80

Dhakshina Barathadesamlo Gramadevatalu
INR
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             భారాతీయ మత విశ్వాసాలలోకెల్లా గ్రామ దేవతల ఆరాధన అతి ప్రాచినమైనది. క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితం ఆర్యులు భారతదేశంలోకి రాక ముందు ఇక్కడ నివసించిన చామనచాయ వర్ణస్ధుల మత విన్యాసాలు, ఆచారాలు ప్రపంచంలోని ఇతర ప్రాచీన జాతుల మత విశ్వాసాలకూ, నమ్మకాలకూ బహుశా ఎక్కువ భిన్నంగా లేవు. ఇక్కడి ఆది జాతీయులను ద్రావిడులని కూడా అంటారు. ప్రపంచంలో రకరకాలుగా మంచీ, చెడూ శక్తులు వున్నాయనీ, అన్ని రకాల అసాధారణ సంఘటనలకు - ముఖ్యంగా వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలకు - అవే కారణమని వీరు నమ్మేవారు. ఇటువంటి అసంఖ్యాక శక్తులను శాంతింపజేసి సంతృప్తి పరచడమే వారి 'మతం' ముఖ్య లక్ష్యం. అదే సమయంలో ప్రతీ గ్రామం ఏదో ఒక శక్తి రక్షణలో వుంటుందని నమ్మి, ఆ శక్తినే సంరక్షక దేవతగా భావించేవారు.

           బహుశా మనిషి వ్యవసాయ తెగలుగా స్థిర నివాసం ఏర్పరచుకొంటున్న సమయంలో ఈ గ్రామ దేవతలు ఆవిర్భవించి వుంటారు. సేమిటిక్ జాతులు, ఈజిప్టు, బాబిలోనియా, నైనివే (Nineveh) వంటి మహా సామ్రాజ్యాల జాతీయ దేవతల మూల లక్షణాలు మనకు వీటిలో కనిపిస్తాయి. ఎలాగయితే కుటుంబం వంశంగా,వంశం  తెగగా, తెగ దేశంగా, దేశం మహాసామ్రాజ్యంగా పరివర్తనం చెందిందో అలాగే కుటుంబ దేవత కూడా సహజంగానే సామ్రాజ్య దేవతగా ఎదిగింది. ఆర్యులు రాక పూర్వం ఇక్కడి ప్రజలు చిన్న చిన్న వ్యవసాయక, పశుపాలక తెగలుగా వుండేవారు. దేశాలు గానీ, దురాక్రమణదారీ సామ్రాజ్యాలు గానీ వుండేవి కావు. ఆర్యులు ఉత్తరభారతాన్ని ఆక్రమించుకున్న తర్వాత గానీ ఇక్కడి ప్రజల్లో ప్రపంచానికి సంబంధించిన సమగ్ర తాత్విక చింతన అభివృద్ధి చెందలేదు. సీదాసాదాగా వుండే ద్రావిడులు విశ్వానికి సంబందించిన సమస్యల జోలికి వెళ్ళే వారు కాదు. గ్రామ జీవితానికి సంబందించిన దైనందిన సమస్యలూ, నిజాలకు మాత్రమే వీరు కారణాలు, సమాధానాలు వెదికేవారు. అందుకే వారి మతం గ్రామ దేవతల మీద విశ్వాసం, నాటు సర్వాత్మ వాదాన్ని (Animisim) దాటి ఎదగలేదు.

- హెన్రీ వైట్ హెడ్ 

             భారాతీయ మత విశ్వాసాలలోకెల్లా గ్రామ దేవతల ఆరాధన అతి ప్రాచినమైనది. క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితం ఆర్యులు భారతదేశంలోకి రాక ముందు ఇక్కడ నివసించిన చామనచాయ వర్ణస్ధుల మత విన్యాసాలు, ఆచారాలు ప్రపంచంలోని ఇతర ప్రాచీన జాతుల మత విశ్వాసాలకూ, నమ్మకాలకూ బహుశా ఎక్కువ భిన్నంగా లేవు. ఇక్కడి ఆది జాతీయులను ద్రావిడులని కూడా అంటారు. ప్రపంచంలో రకరకాలుగా మంచీ, చెడూ శక్తులు వున్నాయనీ, అన్ని రకాల అసాధారణ సంఘటనలకు - ముఖ్యంగా వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలకు - అవే కారణమని వీరు నమ్మేవారు. ఇటువంటి అసంఖ్యాక శక్తులను శాంతింపజేసి సంతృప్తి పరచడమే వారి 'మతం' ముఖ్య లక్ష్యం. అదే సమయంలో ప్రతీ గ్రామం ఏదో ఒక శక్తి రక్షణలో వుంటుందని నమ్మి, ఆ శక్తినే సంరక్షక దేవతగా భావించేవారు.            బహుశా మనిషి వ్యవసాయ తెగలుగా స్థిర నివాసం ఏర్పరచుకొంటున్న సమయంలో ఈ గ్రామ దేవతలు ఆవిర్భవించి వుంటారు. సేమిటిక్ జాతులు, ఈజిప్టు, బాబిలోనియా, నైనివే (Nineveh) వంటి మహా సామ్రాజ్యాల జాతీయ దేవతల మూల లక్షణాలు మనకు వీటిలో కనిపిస్తాయి. ఎలాగయితే కుటుంబం వంశంగా,వంశం  తెగగా, తెగ దేశంగా, దేశం మహాసామ్రాజ్యంగా పరివర్తనం చెందిందో అలాగే కుటుంబ దేవత కూడా సహజంగానే సామ్రాజ్య దేవతగా ఎదిగింది. ఆర్యులు రాక పూర్వం ఇక్కడి ప్రజలు చిన్న చిన్న వ్యవసాయక, పశుపాలక తెగలుగా వుండేవారు. దేశాలు గానీ, దురాక్రమణదారీ సామ్రాజ్యాలు గానీ వుండేవి కావు. ఆర్యులు ఉత్తరభారతాన్ని ఆక్రమించుకున్న తర్వాత గానీ ఇక్కడి ప్రజల్లో ప్రపంచానికి సంబంధించిన సమగ్ర తాత్విక చింతన అభివృద్ధి చెందలేదు. సీదాసాదాగా వుండే ద్రావిడులు విశ్వానికి సంబందించిన సమస్యల జోలికి వెళ్ళే వారు కాదు. గ్రామ జీవితానికి సంబందించిన దైనందిన సమస్యలూ, నిజాలకు మాత్రమే వీరు కారణాలు, సమాధానాలు వెదికేవారు. అందుకే వారి మతం గ్రామ దేవతల మీద విశ్వాసం, నాటు సర్వాత్మ వాదాన్ని (Animisim) దాటి ఎదగలేదు. - హెన్రీ వైట్ హెడ్ 

Features

  • : Dhakshina Barathadesamlo Gramadevatalu
  • : Henry White Head
  • : Vishalandra Publishing House
  • : VISHALD238
  • : Paperback
  • : November 2013
  • : 138
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Dhakshina Barathadesamlo Gramadevatalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam