Uttama Latin American Kadhalu

By Elanaga (Author)
Rs.150
Rs.150

Uttama Latin American Kadhalu
INR
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

        ఈ కధలను యింత అపురూపంగా ఎంపిక చేసుకోవటంలోనే ఎలనాగ గారి అభిరుచి తెలుస్తుంది. నిజానికి ఈ కధల్లోని వైవిధ్యం మనల్ని అబ్బురపరుస్తుంది.

        ఒక్కొక్క కధా ఒక్కొక్క మణిపూస

       సంగీత సాహిత్యాలను తన వుచ్చ్వాస నిస్వాసలుగా చేసుకున్న డాక్టర్ గారు, వీటిని తన కవిత్వ పరిభాషలో అనుసృజనచేసి, తెలుగు పాటకులకు కానుకగా యిస్తున్నారు.

-ముక్తవరం పార్ధసారధి

 

         మౌలికంగా మానవ స్పందనలు ఏ ప్రాంతంలోనైనా, ఏ బాషలోనైనా ఒకటే అయినప్పటికీ అనువాద కధల్లోని భౌతిక జీవితపు భిన్నత్వం, విలక్షణ వాతావరణం మనసుని తాజాదనంతో నింపేస్తాయి.

          కానీ ఇందులో  వున్న కధలు మాత్రం పై అనుభవంతో పాటు ఎన్నడూ ఎరగని మానసిక ప్రాంతాల్లో కూడా విహరింపజేస్తాయి. అపరిచిత ప్రాంతాల్లో వొదిలి వేయబడటం ఎంత అద్బుత అనుభవం! ఎన్ని కాల్పనిక దారుల్ని, వంతెనల్ని నిర్మించుకోవాల్సి వస్తుందో!!

          అలాంటి కధల ప్రపంచం ఇది!

          ఈ కదల ప్రపంచంలో మిలమిలలాడే చుక్కల్లాంటి హటాత్ ప్రవర్తనలు మన మూసదనాన్ని స్వేచ్చలోకి అనువదిస్తుంటే పెదాల మీద చిరునవ్వు, కళ్ళ లోపల ఏదో కాంతి అలా వాలి పోతుంటాయి.

          'వార్డ్ రోబు, ముసలాయనా, మృత్యువు' కధని మొదట పాలపిట్ట పత్రికలో చదివినప్పుడు కధని ఇలా ఎలా చెప్పారు అని ఆశ్చర్యానందాల్లో మునిగిపోయాను. దాన్ని ఎన్నిసార్లు చదివానంటే అందులో ప్రతివాక్యము గుర్తుండిపోయింది. అలాంటి మరిన్ని కధలతో ఈ పుస్తకం వెలువడటం మంచి సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళకు మరిచిపోలేని ఒక విందు భోజనం.

         గాఢమైన అనుభూతి కోసమే కాకుండా, కధకులందరూ ఒక సిలబస్ లాగా చదవాల్సిన పుస్తకం ఇది. చదవండి! నాక్కలిగిన అనుభవం కంటే గొప్ప అనుభవం మీకోసం ఎదురు చూస్తుందేమో ఎవరికీ తెలుసు?

-రమణజీవి  

20 మంచి లాటిన్ అమెరికా కధలు ఉన్నాయి.

        ఈ కధలను యింత అపురూపంగా ఎంపిక చేసుకోవటంలోనే ఎలనాగ గారి అభిరుచి తెలుస్తుంది. నిజానికి ఈ కధల్లోని వైవిధ్యం మనల్ని అబ్బురపరుస్తుంది.         ఒక్కొక్క కధా ఒక్కొక్క మణిపూస        సంగీత సాహిత్యాలను తన వుచ్చ్వాస నిస్వాసలుగా చేసుకున్న డాక్టర్ గారు, వీటిని తన కవిత్వ పరిభాషలో అనుసృజనచేసి, తెలుగు పాటకులకు కానుకగా యిస్తున్నారు. -ముక్తవరం పార్ధసారధి            మౌలికంగా మానవ స్పందనలు ఏ ప్రాంతంలోనైనా, ఏ బాషలోనైనా ఒకటే అయినప్పటికీ అనువాద కధల్లోని భౌతిక జీవితపు భిన్నత్వం, విలక్షణ వాతావరణం మనసుని తాజాదనంతో నింపేస్తాయి.           కానీ ఇందులో  వున్న కధలు మాత్రం పై అనుభవంతో పాటు ఎన్నడూ ఎరగని మానసిక ప్రాంతాల్లో కూడా విహరింపజేస్తాయి. అపరిచిత ప్రాంతాల్లో వొదిలి వేయబడటం ఎంత అద్బుత అనుభవం! ఎన్ని కాల్పనిక దారుల్ని, వంతెనల్ని నిర్మించుకోవాల్సి వస్తుందో!!           అలాంటి కధల ప్రపంచం ఇది!           ఈ కదల ప్రపంచంలో మిలమిలలాడే చుక్కల్లాంటి హటాత్ ప్రవర్తనలు మన మూసదనాన్ని స్వేచ్చలోకి అనువదిస్తుంటే పెదాల మీద చిరునవ్వు, కళ్ళ లోపల ఏదో కాంతి అలా వాలి పోతుంటాయి.           'వార్డ్ రోబు, ముసలాయనా, మృత్యువు' కధని మొదట పాలపిట్ట పత్రికలో చదివినప్పుడు కధని ఇలా ఎలా చెప్పారు అని ఆశ్చర్యానందాల్లో మునిగిపోయాను. దాన్ని ఎన్నిసార్లు చదివానంటే అందులో ప్రతివాక్యము గుర్తుండిపోయింది. అలాంటి మరిన్ని కధలతో ఈ పుస్తకం వెలువడటం మంచి సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళకు మరిచిపోలేని ఒక విందు భోజనం.          గాఢమైన అనుభూతి కోసమే కాకుండా, కధకులందరూ ఒక సిలబస్ లాగా చదవాల్సిన పుస్తకం ఇది. చదవండి! నాక్కలిగిన అనుభవం కంటే గొప్ప అనుభవం మీకోసం ఎదురు చూస్తుందేమో ఎవరికీ తెలుసు? -రమణజీవి   20 మంచి లాటిన్ అమెరికా కధలు ఉన్నాయి.

Features

  • : Uttama Latin American Kadhalu
  • : Elanaga
  • : Palapitta Books
  • : PALAPITA07
  • : Paperback
  • : 2013
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Uttama Latin American Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam