Prapancha Tatwam- Nayakatwam

Rs.200
Rs.200

Prapancha Tatwam- Nayakatwam
INR
VISHALA450
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేయగలిగేది తాత్వికులు, రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు చెడ్డవారైతే వారి వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. అదే మంచివారైతే లాభం చేకూరుతుంది. ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్రలో అన్ని రకాల పాలకులకు ఉదాహరణలు దొరుకుతాయి. వాళ్ళు కొన్ని నమూనాల్ని సృష్టించారు.

          ఈ పుస్తకంలో 50 మంది ప్రపంచ ఖ్యాతిగాంచిన తాత్వికులు, నేతల జీవితాల్ని సంక్షిప్తంగా పొందుపరచడం జరిగింది. వీరెవరు, ఎక్కడివారు, ఎప్పటివారు, ఎటువంటివారు అని తరచిచూస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ యాభై మందిలో క్రీ.పూ. కాలానికి చెందిన వారిలో సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రజ్ఞులు కాగా అలెగ్జాండర్ , జూలియస్ సీజర్ లు రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులు. క్రీస్తు తర్వాత వారిలో మార్క్స్, ఎంగెల్స్, కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు కాగా హెగెల్, వోల్టేర్, రూసో, జాన్ లాక్ లు తమ రచనలతో అమెరికా స్వాతంత్ర్య యుద్ధం, ఫ్రెంచి విప్లవం, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులకు కారణభూతులైన తాత్వికులు. లెనిన్ రష్యాలో విప్లవాన్ని విజయవంతం చేసినవాడు. లెనిన్ తర్వాత స్టాలిన్ ఆ పరంపరను కొనసాగించి చైనాలో మావోను, ఉత్తర కొరియాలో కిమ్ ఇల్ నుంగ్ ను ప్రోత్సహించారు.

          ఈనాటి యువతరానికి రాజకీయాల పట్ల నాయకత్వం పట్ల సరైన అవగాహన కొదవై చుట్టూ ఉన్న అవినీతి రాజుల్ని చూసి రాజకీయాలంటే ఇంతే అనుకుంటున్నారు. ఈనాటి యువతరం నుంచి అటువంటి అపోహలు తొలగించి యుక్తాయుక్త విచక్షణ పెరగడానికి ఈ రచన దోహదపడాలని ఆకాంక్షిస్తూ...

                                                                                   - డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు 

          ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేయగలిగేది తాత్వికులు, రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు చెడ్డవారైతే వారి వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. అదే మంచివారైతే లాభం చేకూరుతుంది. ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్రలో అన్ని రకాల పాలకులకు ఉదాహరణలు దొరుకుతాయి. వాళ్ళు కొన్ని నమూనాల్ని సృష్టించారు.           ఈ పుస్తకంలో 50 మంది ప్రపంచ ఖ్యాతిగాంచిన తాత్వికులు, నేతల జీవితాల్ని సంక్షిప్తంగా పొందుపరచడం జరిగింది. వీరెవరు, ఎక్కడివారు, ఎప్పటివారు, ఎటువంటివారు అని తరచిచూస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ యాభై మందిలో క్రీ.పూ. కాలానికి చెందిన వారిలో సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రజ్ఞులు కాగా అలెగ్జాండర్ , జూలియస్ సీజర్ లు రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులు. క్రీస్తు తర్వాత వారిలో మార్క్స్, ఎంగెల్స్, కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు కాగా హెగెల్, వోల్టేర్, రూసో, జాన్ లాక్ లు తమ రచనలతో అమెరికా స్వాతంత్ర్య యుద్ధం, ఫ్రెంచి విప్లవం, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులకు కారణభూతులైన తాత్వికులు. లెనిన్ రష్యాలో విప్లవాన్ని విజయవంతం చేసినవాడు. లెనిన్ తర్వాత స్టాలిన్ ఆ పరంపరను కొనసాగించి చైనాలో మావోను, ఉత్తర కొరియాలో కిమ్ ఇల్ నుంగ్ ను ప్రోత్సహించారు.           ఈనాటి యువతరానికి రాజకీయాల పట్ల నాయకత్వం పట్ల సరైన అవగాహన కొదవై చుట్టూ ఉన్న అవినీతి రాజుల్ని చూసి రాజకీయాలంటే ఇంతే అనుకుంటున్నారు. ఈనాటి యువతరం నుంచి అటువంటి అపోహలు తొలగించి యుక్తాయుక్త విచక్షణ పెరగడానికి ఈ రచన దోహదపడాలని ఆకాంక్షిస్తూ...                                                                                    - డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు 

Features

  • : Prapancha Tatwam- Nayakatwam
  • : Dr Daggubati Venkateswara Rao
  • : Nivedita Publications
  • : VISHALA450

Reviews

Be the first one to review this product

Discussion:Prapancha Tatwam- Nayakatwam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam